జాతీయ వార్తలు

రాజకీయ పార్టీలపై ఫిర్యాదుల విచారణకు త్రిసభ్య బెంచ్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఆరు జాతీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించడానికి ముగ్గురు సభ్యులుతో కూడిన విస్తృత బెంచ్‌ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్‌కె మాధుర్ ఏర్పాటు చేశారు. శ్రీ్ధర్ ఆచార్యుల సారధ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ స్థానే ఇది పనిచేస్తుంది 2016 జూలై 22 నుం చి బెంచ్ పనిచేస్తుండగా పనివత్తిడి వల్ల కొనసాగలేనని బిమల్ జుల్కా తెలిపారు.
పార్టీల విషయాన్ని అంతకు ముందు కమిటీ ఐదునెలపాటు విచారించినప్పటికీ సభ్యులెవరూ అందులో పాలుపంచుకోకపోవడం ఆశ్చర్యం. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి విద్యార్హతలకు సంబంధించిన కేసును శ్రీ్ధర్ ఆచార్యులు విచారించారు. మంత్రికి సంబంధించి బిఏ కోర్సుకు వివరాలు అందించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు. తాజాగా సమాచార కమిషనర్లు శరత్ సబర్వాల్, మంజుల ప్రషేర్, దివ్య ప్రకాశ్ సిన్హాలతో కూడిన బెంచ్‌ను సిఐసి మాధూర్ నియమించారు. నూతన ధర్మాసనం ఈనెల 16 నుంచి పని ప్రారంభిస్తుందని కమిషన్ ఓ ప్రకటలో వెల్లడించింది. రాజ్‌నాథ్ సింగ్(బిజెపి0, సోనియాగాంధీ (కాం గ్రెస్), మాయావతి(బిఎస్పీ), శరద్ పవార్(ఎన్‌సిపి),సుధాకర్‌రెడ్డి (సిపిఐ), ప్రకాశ్ కారత్ (సిపిఎం) లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్టీ బడ్జెట్, నిబంధనావళి, ఎన్నికలకు సంబంధించి వివరాలు అందించాలని ఆర్‌కె జైన్ అనే వ్యక్తి ఆర్‌టిఐను ఆశ్రయించారు. అయితే ఆర్‌టిఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఆరు వారాల్లో కేసును పరిష్కరించాలని సిఐసిని ఆదేశించింది.
ఇది 2014లో జరిగింది. అలాగే సుభాష్ అగర్వాల్, బిహారీలాల్ తవైట్, పవన్ కుమార్ పహ్వా, వికాస్ కొత్తాల్, వినోద్ కుమార్ మిశ్రా, పిసి శర్మ, మల్కైత్ సింగ్ బాజ్వా, ముజీబ్ ఉల్హా, దీపక్ సేథీ, రామేశ్వర్ శర్మ, అనిల్ కుమార్ సిన్హా, సంత్‌రామ్, అసీమ్ తక్యార్, సంజయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లన్నీటి కలిపి విచారించిన కోర్టు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చింది.