క్రీడాభూమి

అశ్విన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండర్‌గా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. కెరీర్‌లో 51వ టెస్టు ఆడుతున్న అతనికి ఇది 11వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలోనే అతను టెస్టుల్లో 2,000 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు, 275 వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. రిచర్డ్ హాడ్లీ ఈ ఫీట్‌ను తన 58వ టెస్టులో సాధిస్తే, అశ్విన్ 51వ టెస్టులోనే దీనిని అందుకున్నాడు. కాగా, టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు, 2,000 పరుగులను వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో అతను మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ 42 టెస్టుల్లోనే 200 వికెట్లు, 2,000 పరుగులను పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (్భరత్), ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్) తమతమ 50 టెస్టులో ఈ అరుదైన ఫీట్‌ను సాధించి, సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అశ్విన్ ఇప్పుడు మూడో స్థానాన్ని సంపాదించాడు. మొత్తం మీద భారత్ తరఫున 200 వికెట్లు, 2,000 పరుగులు పూర్తి చేసిన వారిలో అశ్విన్ నాలుగోవాడు. ఇంతకు ముందు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఈ జాబితాలో ఉంటే, వారి సరసన అశ్విన్ చేరాడు.