క్రీడాభూమి

పుజారా స్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని కనబరుస్తూ, అరుదైన మైలురాళ్లను చేరుకుంటున్న బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా టీమిండియా టెస్టు జట్టులో తన స్థానాన్ని ఇప్పటికే పదిలం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన పుజారా రెండో రోజు ఆటలో తన ఓవర్‌నైట్ స్కోరు 128 పరుగులకు కేవలం ఐదు పరుగులు జోడించి, దిముత్ కరుణరత్నే బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. అయితే, అప్పటికే అతను చిరస్మరణీయ మైలురాయిని దాటేశాడు. కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతూ, సెంచరీ సాధించిన ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సంపాదించారు. ఇంతకు ముందు పాలీ ఉమ్రీగర్ (ఇంగ్లాండ్‌పై కాన్పూర్‌లో/ 1961), సునీల్ గవాస్కర్ (ఇంగ్లాండ్‌పై ఓవల్‌లో/ 1979), గుండప్ప విశ్వనాథ్ (వెస్టిండీస్‌పై చెన్నైలో/ 1979), కపిల్ దేవ్ (వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో/ 1983), వివిఎస్ లక్ష్మణ్ (ఆస్ట్రేలియాపై సిడ్నీలో/ 2004), విరాట్ కోహ్లీ (ఇంగ్లాండ్‌పై విశాఖపట్నంలో/ 2016) ఈ విధంగా తమతమ 50 టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు నమోదు చేశారు. కాగా, పుజారా సెంచరీ చేసే క్రమంలో టెస్టుల్లో 4,000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. ఈ ఫీట్ సాధించిన 15వ భారత బ్యాట్స్‌మన్ అతను. అయితే, సగటున 50కిపైగా పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతనికి ఆరో స్థానం దక్కింది. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెవాగ్, విరాట్ కోహ్లీ ఈ విధంగా 4,000 పరుగులను 50కి పైగా సగటుతో పూర్తి చేశారు. టీమిండియాలో మేటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరు సంపాదించిన 29 ఏళ్ల పుజారా ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై భారత్ టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకోవడంలో కీలక భూమిక పోషించాడు. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లోనూ అతను శతకాలు సాధించడం విశేషం.