క్రీడాభూమి

ఆరేసిన ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 4: ఈ సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఆరు వందల పరుగుల మైలురాయిని అధిగమించింది. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది. భారత్ కంటే లంక ఇంకా 572 పరుగులు వెనుకబడగా, ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు సాధించిన భారత్, రెండో టెస్టు మొదటి రోజు ఆటలోనూ అదే దూకుడును కొనసాగించి, ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 344 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్ మరో ఆరు పరుగులు జోడించి చటేశ్వర్ పుజారా వికెట్‌ను కోల్పోయింది. 128 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన అతను కేవలం ఐదు పరుగులు జత చేసి, దిముత్ కరుణరత్నే బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. 232 బంతులు ఎదుర్కొని 133 పరుగులు చేసిన అతని స్కోరులో 11 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉన్నాయి. ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా నిలదొక్కుకొని ఆడడంతో, భారత్ స్కోరు నాలుగు పరుగులు మైలురాయిని సులభంగానే అధిగమించింది. జట్టు స్కోరు 413 పరుగుల వద్ద అజింక్య రహానే అవుట్ కావడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే 222 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి, మలింద పుష్పకుమార బౌలింగ్‌లో క్రీజ్ బయటకు వచ్చి షాట్ కొట్టే ప్రయత్నంలో విఫలమై వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. అశ్విన్ (54), వృద్ధిమాన్ సాహా (67), రవీంద్ర జడేజా (70 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో, భారత్ వరుసగా రెండోసారి ఆరు వందలకుపైగా పరుగులను నమోదు చేయగలిగింది. 158 ఓవర్లలో 9 వికెట్లకు 622 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. లంక బౌలర్లలో రంగన హెరాత్ 154 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మలింద పుష్పకుమార 2 వికెట్లు కూల్చాడు. ది ముత్ కరుణరత్నే, దిల్‌రువాన్ పెరెరా చెరో వికెట్ సాధించారు.
ఖాతా తెరవకుండానే..
భారత్ సాధించిన భారీ స్కోరుతో కంగుతిన్న శ్రీలంక తీవ్రమైన ఒత్తిడికి లోనైట్టు కనిపిస్తున్నది. పరుగుల ఖాతాను కూడా తెరవకుండానే మొదటి వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని ఉపుల్ తరంగ సరిగ్గా ఆడలేకపోయాడు. బంతి నేరుగా లోకేష్ రాహుల్ వద్దకు పంపగా, అతను దానిని ఒడిసి పట్టుకున్నాడు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటున్నట్టు కనిపించిన మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే (25)ను కూడా అశ్విన్ వెనక్కు పంపాడు. ఫస్ట్‌స్లిప్‌లో కాపుకాసిన అజింక్య రహానే చక్కటి క్యాచ్ పట్టగా కరుణరత్నే వెనుదిరిగాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దినేష్ చండీమల్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 2 వికెట్లకు 50 పరుగులు చేయగా, చండీమల్ 8, కుశాల్ మేండిస్ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 344): శిఖర్ ధావన్ ఎల్‌బి దిల్‌రువాన్ పెరెరా 35, లోకేష్ రాహుల్ రనౌట్ 57, చటేశ్వర్ పుజారా ఎల్‌బి దిముత్ కరుణరత్నే 133, విరాట్ కోహ్లీ సి ఏంజెలో మాథ్యూస్ బి రంగన హెరాత్ 13, అజింక్య రహానే స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి మలింద పుష్పకుమార 132, రవిచంద్రన్ అశ్విన్ బి రంగన హెరాత్ 54, వృద్ధిమాన్ సహా స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి రంగన హెరాత్ 67, హార్దిక్ పాండ్య సి ఏంజెలో మాథ్యూస్ బి మలింద పుష్కకుమార 20, రవీంద్ర జడేజా 70 నాటౌట్, మహమ్మద్ షమీ సి ఉపుల్ తరంగ బి రంగన హెరాత్ 19, ఉమేష్ యాదవ్ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (158 ఓవర్లలో 9 వికెట్లకు) 622 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-56, 2-109, 3-133, 4-350, 5-413, 6-451, 7-496, 8-568, 9-598.
బౌలింగ్: నువాన్ ప్రదీప్ 17.4-2-63-0, రంగన హెరాత్ 42-7-154-4, దిముత్ కరుణరత్నే 8-0-31-1, దిల్‌రువాన్ పెరెరా 40-3-147-1, మలింద పుష్పకుమార 38.2-2-156-2, ధనంజయ డిసిల్వ 12-0-59-0.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నే సి అజింక్య రహానే బి అశ్విన్ 25, ఉపుల్ తరంగ సి లోకేష్ రాహుల్ బి అశ్విన్ 0, కుశాల్ మేండిస్ 15 బ్యాటింగ్, దినేష్ చండీమల్ 8 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 50.
వికెట్ల పతనం: 1-0, 2-33.
బౌలింగ్: మహమ్మద్ షమీ 3-1-7-0, రవిచంద్రన్ అశ్విన్ 10-2-38-2, రవీంద్ర జడేజా 7-4-4-0.