జాతీయ వార్తలు

సుష్మాపై కాంగ్రెస్ హక్కుల ఉల్లంఘన నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: విదేశాంగ విధానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సందర్భంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసు ఇచ్చింది. స్వల్పకాలిక చర్చకు ఇచ్చిన సమాధానంలో సుష్మాస్వరాజ్ బాండుంగ్ సమావేశం 60వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధి ఎవరు కూడా ఎలాంటి ప్రసంగం లేదా ప్రకటన చేయలేదని చెప్పారని కాంగ్రెస్ సభ్యులు అంబికా సోనీ, వివేక్ తన్ఖా, ప్రతాప్ బాజ్వా, రాజేన్ గోహైన్, రాజేంద్ర గౌడ తదితరులు ఆరోపించారు. అంతేకాదు, ఆ సమావేశంలో భారత ప్రతినిధి బృందం సభ్యులెవరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కూడా ఆమె సభకు చెప్పారని, అయితే అది తప్పని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. అందువల్ల సభా నిబంధనలు 188 రూల్ కింద ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నామని వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. బాండుంగ్ సదస్సు, ఆసియా- ఆఫ్రికా సదస్సు వేర్వేరని సమాధానం సందర్భంగా సుష్మాస్వరాజ్ చెప్పారని, అయితే వాస్తవానికి ఆసియా- ఆఫ్రికా సదస్సునే బాండుంగ్ సమావేశంగా పిలుస్తారని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందజేసిన ఆ నోటీసులో కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బాండుంగ్‌లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ప్రసంగించారని గురువారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ గుర్తు చేయగా, అది పూర్తిగా తప్పని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి, ఆ శాఖ సహాయ మంత్రి ప్రసంగాలు చేశారని తృణమూల్ కాణగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రియాన్ సైతం పేర్కొనగా, అంతకు ముందు రోజు జరిగిన వేరే సమావేశంలో ఆ ప్రసంగాలు చేశామే తప్ప బాండుంగ్ సదస్సులో కాదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. కాగా, ఆ ఆసియా-ఆఫ్రికా సదస్సు (బాండుంగ్ సదస్సు)లో సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం ఆ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దానే్న కాంగ్రెస్ పార్టీ తన నోటీసుకు జత చేసింది.