జాతీయ వార్తలు

కార్తి చిదంబరానికి సిబిఐ లుక్‌అవుట్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసుకు సంబంధించి కార్తికి సిబిఐ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పదిరోజుల కిందటే కార్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కార్తి పిటిషన్‌ను విచారణకు చేపట్టిన హైకోర్టు శుక్రవారం హోంమంత్రిత్వ శాఖనుంచి లుక్ అవుట్ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే సిబిఐ ఇదివరకే చిదంబరానికి ఐఎన్‌ఎక్స్ మీడియా డీల్‌కు సంబంధించి సమన్లను జారీ చేసింది. ఆ సమన్లకు సమాధానం చెప్పడం ఇష్టంలేని చిదంబరం కూడా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కార్తి మాత్రం సిబిఐ లుక్ అవుట్ నోటీసులపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితమే కార్తి ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాను దేశంలోనే ఉంటున్నానని, సిబిఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని చిదంబరం ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు.