క్రీడాభూమి

ఇదేం న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న తన పేరు ఈసారి కూడా అర్జున్ అవార్డుకు ప్రతిపాదించిన పేర్లలో లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఇదేం న్యాయమంటూ వాపోయాడు. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) తనకు అన్యాయం చేసిందని ఆరోపించాడు. ఏ ప్రాతిపదికపై ప్రతిపాదనలు పంపించారో అర్థం కావడం లేదని శనివారం ఒక ప్రకటనలో బొపన్న తెలిపాడు. ఈసారి అర్జున అవార్డు కోసం సాకేత్ మైనేని పేరును ఎఐటిఎ ప్రతిపాదించింది.
ద్రోణాచార్యకు రామకృష్ణన్: కోచ్‌లకు అందచేసే ద్రోణాచార్య అవార్డుకు రామకృష్ణన్ గాంధీ పేరును భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రతిపాదించింది. అథ్లెటిక్స్ కోచ్‌గా అతనికి మంచి పేరు ఉంది. అతని మార్గదర్శకంలోనే రాటుదేలిన గుర్మీత్ సింగ్ గత ఏడాది జపాన్‌లో జరిగిన ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించి, ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. పారాలింపియన్ మరియప్పన్ తంగవేలు మెంటర్‌గా అందరికీ సుపరచితుడైన సత్యనారాయణ పేరును కూడా ద్రోణాచార్య అవార్డుకు అథ్లెటిక్స్ సమాఖ్య ప్రతిపాదించింది. పారాలింపియన్లకు సత్యనారాయణ కోచ్‌గా విశిష్ట సేవలు అందిస్తున్నాడు.