క్రీడాభూమి

ట్రై సిరీస్ టైటిల్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిటోరియా, ఆగస్టు 8: ముంబయి బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ అజేయ సెంచరీతో భారత్-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగేళ్ల క్రితం గెలిచిన ట్రై సిరీస్ ట్రోఫీని తిరిగి నిలబెట్టుకొంది. ఇంతకు ముందు జరిగిన నాలుగు రౌండ్ రాబిన్ మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని అయ్యర్ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చెలరేగి పోయాడు. తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌తో కలిసి మూడో వికెట్‌కు అయ్యర్ 141 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ 131 బంతుల్లో 140 పరుగులు చేసి నాటవుట్‌గా నిలవగా, శంకర్ 86 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అయ్యర్ స్కోరులో 11 బౌడరీలు, నాలుగు సిక్స్‌లున్నాయి. ఈ టోర్నమెంట్‌లో మొదటినుంచి చక్కగా రాణిస్తున్న జట్టు కెప్టెన్ మనీష్ పాండే సైతం 38 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో భారత్ విజయానికి అవసరమైన 268 పరుగులను మరో 19 బంతులు మిగిలి ఉండగానే సాధించింది.
అంతకు ముందు టాస్ గెలిచిన పాండే ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా 115 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి ఒక దశలో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అయితే సీనియర్ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ బెహర్డీన్ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చి సెంచరీతో (114 బంతుల్లో 101 పరుగులు) రాణించడంతో ఆ జట్టు చివరికి 7 వికెట్ల నష్టానికి 267 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. డేవాల్డ్ ప్రిటోరియస్ కూడా అర్ధ సెంచరీ చేసి తమ జట్టు కోలుకోవడానికి తోడ్పడ్డాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు కూల్చాడు.

చిత్రం.. సెంచరీ వీరుడు శ్రేయాస్ అయ్యర్