క్రీడాభూమి

జడేజా స్థానంలో అక్షర్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 9: క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా ఒక టెస్టు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు శ్రీలంకతో ఈనెల 12 నుంచి మొదలయ్యే చివరి, మూడో టెస్టులో అవకాశం దక్కనుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 23 ఏళ్ల అక్షర్ దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆడాడు. ప్రిటోరియాలో ఉన్న అతను గురువారం రాత్రికి జట్టుతో కలుస్తాడని బిసిసిఐ తన ప్రకటనలో వివరించింది. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో జడేజా క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఫీల్డ్ అంపైర్లు చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఐసిసి మ్యాచ్ రిఫరీ అతనిని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశాడు. దీనితో చివరి టెస్టులో అతను ఆడే అవకాశం లేదు. అయితే, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే శ్రీలంకపై సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకోవడంతో, చివరి టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్వీకరించిన జడేజా లేకపోయినా భారత్‌కు వచ్చే నష్టమలేమీ ఉండదు. పైగా బెంచ్ బలాన్ని బేరీజు వేసుకునే అవకాశం దక్కుతుంది. ఇలావుంటే, దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన చివరి మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్ చేసిన అక్షర్ 47 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఏడు వికెట్ల తేడా విజయం సాధించి, సిరీస్‌ను గెల్చుకుంది.
మూడో టెస్టుకు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్-కెప్టెన్), రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్. (తుది జట్టును మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రకటిస్తారు).