క్రీడాభూమి

వాన్ నికెర్క్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 9: దక్షిణాఫ్రికా సంచలన అథ్లెట్ వేడ్ వాన్ నికెర్క్ ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బోణీ చేశాడు. పురుషుల 200, 400 మీటర్ల పరుగులో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అతను 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 200 మీటర్ల విభాగంలో అతను పోటీపడాల్సి ఉంది. 25 ఏళ్ల వాన్ నికెర్క్ 400 మీటర్ల పరుగును 43.98 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. స్టువెన్ గార్డ్‌నర్ (బహమాస్) 44.41 సెకన్లతో రజత పతకాన్ని అందుకోగా, అబ్దాలే హరూన్ (కతార్) 44.48 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, 25 ఏళ్ల వాన్ నికెర్క్ 200 మీటర్ల విభాగంలోనూ స్వర్ణాన్ని సాధిస్తే, సుమారు 30 ఏళ్ల క్రితం మైఖేల్ జాన్సన్ నెలొకల్పిన రికార్డును సమం చేస్తాడు.
ఇలావుంటే, పురుషుల 800 మీటర్ల విభాగంలో పియరె అంబ్రోస్ బొసే (ఫ్రాన్స్) స్వర్ణ పతకం సాధించాడు. ఆడం కొజొట్ (పోలాండ్), కిప్యెగాన్ బెట్ (కెన్యా) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. మారథాన్ ఈవెంట్‌లో జెఫ్రీ కిరుయ్ (కెన్యా), టామిరట్ టొలా (ఇథియోపియా), అల్ఫాన్స్ సింబూ (టాంజానియా) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. పోల్ వాల్ట్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం అమెరికాకు చెందిన శామ్ కెండ్రిక్స్‌కు దక్కింది. అతను 5.95 మీటర్ల ఎత్తును లంఘించి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. పోలాండ్‌కు చెందిన పీటర్ లిసెక్ (5.89 మీటర్లు), రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్/ 5.89) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. లాంగ్ జంప్‌లో దక్షిణాఫ్రికా అథ్లెట్ లువో మన్యోగా 8.48 మీటర్ల దూరాన్ని పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. జరియన్ లాసన్ (అమెరికా/ 8.44 మీటర్లు), రుష్వాహి సమాయ్ (దక్షిణాఫ్రికా/ 8.32 మీటర్లు) ద్వితీయ, తృతీయ స్థానాలను సంపాదించారు. షాట్ పుట్‌లో తొమాస్ వాల్ష్ (న్యూజిలాండ్/ 22.03 మీటర్లు), జో కొవాక్స్ (అమెరికా/ 21.66 మీటర్లు), స్టిప్ జనిక్ (క్రొయేషియా/ 21.46 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆండ్రియస్ గజుజ్ (లిథునేనియా/ 69.21 మీటర్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, డానియెల్ స్టానీ (స్వీడన్/ 69.19 మీటర్లు), మాసన్ ఫినే్ల (అమెరికా/ 60.03 మీటర్లు) రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు.
మహిళల విభాగంలో 100 మీటర్ల పరుగులో అమెరికా స్టార్ టోరీ బొవీ, ఐవరీ కోస్ట్ అథ్లెట్ మేరీ జోసీ తా లవో, నెదర్లాండ్స్‌కు చెందిన డఫ్నే షిఫర్స్ మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. 1,500 మీటర్ల పరుగులో ఫైట్ కిపియాగ్, 10,000 మీటర్లలో అల్మాజ్ అయానా, పోల్ వాల్ట్‌లో ఎకతెరిని స్ట్ఫోనిడీ, ట్రిపుల్ జంప్‌లో యులిమార్ రొజాస్, హ్యామర్ త్రోలో అనితా వొడాక్రిజ్, జావెలిన్ త్రోలో బార్బరా స్పొటాకొవా విజేతలుగా నిలిచారు.