జాతీయ వార్తలు

మన నేతలు కలలుకన్న భారతాన్ని నిర్మిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ బుధవారం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని, మత సామరస్యాన్ని పెంపొందిస్తామని, దేశాన్ని అవినీతి రహితం చేస్తామని ప్రతిన బూనింది. అలాగే మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతాన్ని నిర్మించడానికి నిర్విరామంగా కృషి చేస్తామని ప్రతిన బూనుతూ లోక్‌సభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘2022నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవనున్న సందర్భంగా మనం ఉత్సవాలను జరుపుకొనే నాటికి మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారత దేశాన్ని నిర్మించడానికి ప్రతి పౌరుడ్ని వెంట తీసుకువెళతామని 125 కోట్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేము ప్రతిన బూనుతున్నాం’ అని ఆ తీర్మానం పేర్కొంది, సభలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు ప్రసంగించిన తర్వాత చేసిన ఈ తీర్మానం పాఠాన్ని లోక్‌సభ స్పీకర్ చదవగా సభ్యులు హర్షధ్వానాల మధ్య ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. ‘బలమైన, సుఖ సంతోషాలతో తులతూగే. స్వచ్ఛమైన, అవినీతి రహితమైన భారత దేశాన్ని నిర్మించడానికి కంకణబద్ధులం కావాలి. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, మత సామరస్యాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి మనం కృతనిశ్చయులం కావాలి’ అని ఆ తీర్మానం పేర్కొంది.