జాతీయ వార్తలు

క్షుద్ర శక్తులు మళ్లీ తలెత్తుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే క్షుద్రశక్తులు మళ్లీ తలెత్తుతున్నాయని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం ప్రమాదంలో పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ బుధవారం లోక్‌సభలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొంటూ స్వేచ్చ ఉండవలసిన స్థానంలో భయాందోళనలు చోటు చేసుకోవటం లేదా? ప్రజాస్వామ్యం పునాదులను బలహీనం చేసే ప్రయత్నాలు జరగటం లేదా? అని ప్రశ్నించారు. భారతదేశం ఆలోచనా విధానం విభజనకారులు, మతతత్వవాదుల చేతుల్లో బందీ అయ్యేందుకు అంగీకరించం, బందీ కానివ్వటం జరగదని సోనియా ప్రకటించారు.
స్వాతంత్రం కోసం కాంగ్రెస్ ఎనె్నన్నో త్యాగాలు చేసింది. ఎంతోమంది తమ ప్రాణాలను బలి ఇచ్చారని ఆమె తెలిపారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర సమరయోధులు ప్రజాస్వామ్య, లౌకికవాద, న్యాయపూరిత దేశం కోసం పోరాటం చేశారని సోనియా గుర్తుచేశారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు వ్యతిరేకించాయని పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్ నుద్దేశించి సోనియా విమర్శించినప్పుడు అధికార పక్ష సభ్యుల తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్య్ర సముపార్జనలో ఈ సంస్థలు, వ్యక్తులకు ఎలాంటి పాత్ర లేదని సోనియా గాంధీ చెప్పినప్పుడు కూడా అధికార పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాది వేసిన రాజ్యాంగంపై ద్వేషం, విభజన నీలినీడలు అలుముకుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావేదికల్లో అసమ్మతి, చర్చ, అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆమె చెప్పారు. చట్టంపై చట్టవ్యతిరేక వ్యక్తుల ప్రాబల్యం పెరిగిపోతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రాన్ని రక్షించుకునేందుకు అణచివేత శక్తులతో అనునిత్యం పోరాడవలసి ఉంటుందని సోనియా పిలుపు ఇచ్చారు. మనకు అత్యంత ప్రియమైన భారతదేశ పరిరక్షణ కోసం నిరంత పోరాటం తప్పదని స్పష్టం చేశారు.