జాతీయ వార్తలు

దేవుళ్లకు లింగ వివక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 2: మహిళలకు ఆలయం ప్రవేశం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ దేవుడు లింగ వివక్ష చూపించడని అన్నారు. అహ్మద్‌నగర్‌లోని శనిశింగ్నాపూర్ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడంపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దేవుడికి లింగ వివక్ష ఉండదని, ప్రార్థనలు చేయకుండా ఎవరినీ ఆపకూడదని పవార్ అన్నారు. మహిళలను ఆలయంలోకి రానీయని దేవుడుంటే ఆలాంటి దేవుడి పట్ల తనకు విశ్వాసం ఉండదని ఎన్‌సిపి అధినేత వ్యాఖ్యానించారు. మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధం సమర్ధనీయం కాదన్న పవార్ ఈ విషయంపై ఆలయ కమిటీతో మాట్లాడానని వెల్లడించారు. ‘మహిళలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని ఆలయ కమిటీని కోరాను. చూద్దాం ఏం జరుగుతుందో’నని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని, గ్రామస్థులే ఏదో ఒక నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని పవార్ పేర్కొన్నారు. ‘ముందు గ్రామస్థుల్లో నమ్మకం కలిగించాలి. తరువాతే ప్రభుత్వం ముందుకెళ్తుంది’ అని ఆయన తెలిపారు.
శనిశింగ్నాపూర్‌లో మహిళల ఆలయ ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఇటీవల వినతిపత్రం ఇచ్చారు.

మరో విద్యార్థి
మృతదేహం లభ్యం
జల విషాదంలో 14కు చేరిన మృతులు
పుణె/ముంబయి, ఫిబ్రవరి 2: మహారాష్ట్ర సముద్ర జలాల్లో జరిగిన విషాద ఘటనలో మరో విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. సోమవారం రాయ్‌గఢ్ జిల్లా మురుద్ బీచ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 13మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. సముద్ర జలాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది జరుపుతున్న గాలింపు చర్యల్లో మంగళవారం ఉదయం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది.
దీంతో ఇప్పటివరకు మృతిచెందిన విద్యార్థుల సంఖ్య 14కు పెరిగింది. ‘మంగళవారం లభ్యమైన మృతదేహం మడాకి సయిఫ్ అహ్మద్‌గా గుర్తించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పుణెకు తరలించామ’ని మహారాష్ట్ర కాస్మొపాలిటన్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు పి.ఎ.ఇనామ్‌దార్ వెల్లడించారు. కాగా, పుణెలో వివిధ ప్రదేశాల్లో జరిగిన విద్యార్థుల దహన సంస్కారాలకు కుటుంబ సభ్యులు, మిత్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మృతిచెందిన విద్యార్థులంతా 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు. తొలుత ముగ్గురు నలుగురు విద్యార్థులు మునిగిపోతున్న విషయాన్ని గమనించిన పదిమంది దాకా విద్యార్థులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు వారుకూడా నీటిలో మునిగిపోయారని ఇనామ్‌దార్ వెల్లడించారు. విహారయాత్రకు విద్యార్థులను తీసుకువెళ్లిన ఫ్యాకల్టీ మెంబర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే అంశంపై కాలేజీ యాజమాన్యం విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ మెంబర్లు సహా పదిమంది కాలేజీ సిబ్బంది విద్యార్థులతో వెళ్లారన్నారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు కాలేజీ ట్రస్టీలను, ఉపాధ్యాయులను పంపించామని తెలిపారు. విద్యార్థుల మృతికి నివాళిగా కాలేజీ యాజమాన్యం మంగళవారం సెలవు ప్రకటించింది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కుటుంబానికి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.