క్రీడాభూమి

హర్యానా, తలైవాస్ మ్యాచ్ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో బుధవారం హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లు చెరి 25 పాయింట్లు సాధించాయి. హర్యానా తరఫున సుందన్ నడా 7, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు సాధించారు. తలైవాస్‌కు ప్రభంజన్ 7, అమిత్ హూడా 6 చొప్పున పాయింట్లు అందించారు. అంతర్-మండల చాలెంజ్‌గా ఈ వారం మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ఓటమి బాటలోనే తెలుగు టైటాన్స్
తెలుగు టైటాన్స్ ఓటమి బాటను వీడడం లేదు. బుధవారం గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్‌ను ఢీకొన్న ఈ జట్టు 10 పాయింట్ల తేడాతో చిత్తయింది. సచిన్ 11, సుఖేష్ హెగ్డే 7 చొప్పున పాయింట్లు సంపాదించి లీడ్ తీసుకోవడంతో గుజరాత్‌కు 29 పాయింట్లు లభించాయి. తెలుగు టైటాన్స్ 19 పరుగులకే పరిమితమైంది. వినోద్ కుమార్ 4, రాహుల్ చౌదరి, వికాస్ చెరి మూడు పాయింట్లు చేశారు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. తొమ్మిదా మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఏడో పరాజయం. ఒక మ్యాచ్‌ని గెల్చుకుంది. ఒకటి టై అయంది.