క్రీడాభూమి

బౌన్సర్ దెబ్బకు యువ క్రికెటర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్దాన్: పాకిస్తాన్‌లో క్వెట్టా బేర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జుబైర్ అహ్మద్ అనే యువ క్రికెటర్ బౌన్సర్ దెబ్బకు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. నాలుగు ‘లిస్ట్ ఎ’ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న జుబైర్ ఒక మ్యాచ్ ఆడుతూ, బంతి తలకు తలగడంతో గాయపడ్డాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతనిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడని వివరించింది. అన్ని స్థాయిల్లోనూ హెల్మెట్ ధరించడం తప్పనిసరన్న విషయాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తున్నదని పిసిబి వ్యాఖ్యానించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.