క్రీడాభూమి

సాక్ష్యాలుంటే బయటపెట్టండి: శ్రీశాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్‌కు తాను పాల్పడలేదని, తాను నిర్దోషినని భారత పేసర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను 2013 మే 16న ఢిల్లీ పోలీసులు ముంబయిలో అరెస్టు చేయడం భారత క్రికెట్‌లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే, ముకుల్ ముద్గల్, ఆర్‌ఎం లోధా కమిటీలు ఏర్పాడ్డాయి. బిసిసిఐ వ్యవహారాలను చక్కదిద్దడానికి నేరుగా సుప్రీం కోర్టే నడుం బిగించాల్సి వచ్చింది. పారనాధికారుల బృందాన్ని నియమించి, లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలును పర్యవేక్షిస్తున్నది. ఇలావుంటే, బిసిసిఐ తనపై విధించిన జీవితకాల సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ కేరళ హైకోర్టులో శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవలే తీర్పు వెలువడింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా అతనిపై విధించిన సెస్పెన్షన్ చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనితో ఊపిరి పీల్చుకున్న శ్రీశాంత్ మంగళవారం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిన అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలని బిసిసిఐ తీసుకున్న నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తాజా పరిణామాలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయని, తీవ్రంగా బాధిస్తున్నాయని అన్నాడు. జీవితంలో కొన్ని పొరపాట్లు చేశానని, అయితే, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాల్సిన అవసరంగానీ, అలాంటి అలవాటుగానీ తనకు లేదని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడితే, స్పాట్ ఫిక్సింగ్ తిరిగి భారత క్రికెట్‌లోకి అడుగుపెడుతుందని కొంత మంది చేసిన వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారు తాను ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు నిరూపించే సాక్ష్యాధారాలు ఎవరైనా ఉంటే తక్షణమే వాటిని బహిర్గతం చేయాలని సవాలు విసిరాడు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు సహజంగానే కుటుంబం మొత్తాన్ని బాధిస్తాయని వాపోయాడు. తాను నిర్దోషినని ఇది వరకే చెప్పానని, ఇప్పుడూ అదే అంటున్నానని తెలిపాడు. 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సాధించినప్పుడు చుట్టుపక్కల వారంతా ఎంతో గౌరవంగా చూశారని, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైందని అంటూ కన్నీళ్లపర్యంతమయ్యాడు. తన తల్లిదండ్రులు ప్రశాంతంగా దేశాలయాలకు కూడా వెళ్లలేకపోతున్నారని అన్నాడు. ఇప్పటి వరకూ తనపై ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని, కానీ, చేయని నేరానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తునే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ జాతీయ జట్టులో ఆడడమే తన లక్ష్యమని, అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపాడు. దేశవాళీ పోటీల్లో పాల్గొని, జాతీయ జట్టుకు రావాలన్న వాదన సరైనది కాదని, తన ఫిట్నెస్‌ను, ఫామ్‌ను పరీక్షించాలే తప్ప మళ్లీ కింది స్థాయి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాలని అనడం సమంజసం కాదన్నాడు. టీమిండియాలో స్థానమే తన లక్ష్యమని చెప్పాడు. న్యాయ వ్యవస్థపై, బిసిసిఐపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.