క్రీడాభూమి

కోట్లలో చౌదరీల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కోట్లకు పడగలెత్తిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) డబ్బును పాలక మండలి సభ్యులు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారన్న విషయాన్ని సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) బహిర్గతం చేసింది. 2015 ఏప్రిల్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ బిసిసిఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, తాత్కాలిక కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి చేసిన ఖర్చు మూడు కోట్ల రూపాయలు దాటిందని సిఒఎ తన నివేదికలో పేర్కొంది. ఇద్దరు చౌదరీలు కలిసి 3.27 కోట్ల రూపాయలు మేరకు విదేశీ టూర్లకు విమాన టికెట్లు, బస వంటి వివిధ పద్దుల కింద ఖర్చు చేసినట్టు వివరించింది. ఇందులో అమితాబ్ చౌదరి ఖర్చు 1.56 కోట్ల రూపాయలుకాగా, అనిరుద్థ్ కౌదరి చేసిన ఖర్చు 1.71 కోట్ల రూపాయలు. రాంచీకి చెందిన మాజీ ఐపిఎస్ అధికారి అమితాబ్ చౌదరి విమాన నిటెట్ల కోసం 65 లక్షలు, టిఎ, డిఎ కింద 42.25 లక్షల రూపాయలు తీసుకున్నారని సిఒఎ తన నివేదికలో పేర్కొంది. విదేశీ ద్రవ్య మారక ఖర్చుల కింద 29 లక్షలు, హోటల్ ఖర్చుల కింద 13.51 లక్షలు, కార్యాలయ ఖర్చులకుగాను 3.93 లక్షల రూపాయలను బిసిసిఐ అతనికి చెల్లించినట్టు తెలిపింది. కాగా, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు అత్యంత విధేయుడుగా ముద్రపడిన అనిరుద్ధ్ చౌదరి విమాన టికెట్లకు 60.29 లక్షలు, టిఎ, డిఎగా 75 లక్షలు, విదేశీ ద్రవ్య మారక ఖర్చులుగా 17.64 లక్షలు, హోటళ్లలో బస చేసినందుకు 11 లక్షల రూపాయలను తీసుకున్నట్టు తెలిపింది. అతరత్రా పద్దుల కింద అమితాబ్ చౌదరికి 3.41 లక్షలు, అనిరుద్ధ్ చౌదరికి 2.37 లక్షల రూపాయలు బిసిసిఐ ఇచ్చినట్టు వివరించింది. ఇదే కాలానికి బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రస్తుత అధ్యక్షుడు సికె ఖన్నా తక్కువ మొత్తాలను ఖర్చు చేశారని సిఒఎ పేర్కొంది. ఠాకూర్ సుమారు 24 లక్షల రూపాయలు ఖర్చు చేయగా, ఖన్నా ఖర్చు 6.52 లక్షల రూపాయలని తెలిపింది. లోధా సిఫార్సుల నేపథ్యంలో సుప్రీం కోర్టు తొలగించిన బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే ఒక్క రూపాయి కూడా ఖర్చుల కింద తీసుకోకపోవడం గమనార్హం.
కార్యవర్య సభ్యులను తొలగించండి
లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో అలసత్వం వహించడమేగాక, కీలక అంశాలను పక్కకుపెట్టి, మిగతా వాటిని ఆమోదించడం ద్వారా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న బిసిసిఐ పాలక మండలి సభ్యులను తొలగించాలని సుప్రీం కోర్టును సిఒఎ కోరింది. తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, తాత్కాలిక కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తదితరులను వెంటనే వారివారి పదువుల నుంచి తొలగించాలని సుప్రీం కోర్టుకు రాసిన 26 పేజీల నివేదికలో కోరింది. లోధా సిఫార్సులను అనుసరించి బోర్డు అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను, కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేలను సుప్రీం కోర్టు తొలగించింది. వారి స్థానాల్లో ఖన్నా, అమితాబ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అయితే, గతంలో మాదిరిగానే వీరు కూడా లోధా సిఫార్సులు అమలుకు మోకాలడ్డుతున్నారని సిఒఎ తన నివేదికలో ఆరోపించింది. వీరిని తొలగిస్తేగానీ తమకు అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే బిసిసిఐ పాలక మండలి లోధా సిఫార్సులను అమరు చేయడం లేదని పేర్కొంది.