జాతీయ వార్తలు

ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు మూసివేత నిర్ణయం పరిశీలనకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీసహా పలు ప్రాంతాల్లో సిక్కులకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి 199 కేసులను మూసివేయాలని కేంద్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయాన్ని పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు బుధవారం ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన ఒక పర్యవేక్షక కమిటీని నియమించింది. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరో 42 కేసులను కూడా మూసివేయాలని సిట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పరిశీలించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కమిటీని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కోర్టు ఆ కమిటీని ఆదేశించింది.
అనంతరం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం మూసివేయాలని నిర్ణయించిన కేసులకు సంబందించిన అన్ని రికార్డులను తన ముందుంచాలని గత మార్చి 24న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. 1986 బ్యాచ్‌కి చెందిన ఐపిఎస్ అధికారి ప్రమోద్ ఆస్థానా నేతృత్వంలోని సిట్‌లో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి రాకేశ్ కపూర్, ఢిల్లీ పోలీసుకు చెందిన అదనపు డిప్యూటీ కమిషనర్ కుమార్ జ్ఞానేష్ సభ్యులుగా ఉన్నారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.