హైదరాబాద్

కుప్పకూలిన జలమండలి ప్రహరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి: జలమండలి రిజర్వాయర్ ప్రహరీ కుప్పకూలింది. దీంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయ. ఓ బైక్ గోడ కింద పడి ధ్వంసమైంది. పురాతన గోడ కావడం, అందులో నుంచి లీకేజీ నీరు బయటకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల (హెచ్‌ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బి) సంస్థకు చెందిన రిజర్వాయర్ హఫీజ్‌పేట నుంచి గోకుల్ ప్లాట్స్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్ళే మంజీరా రోడ్డులో ఉంది. హఫీజ్‌పేట, కొండాపూర్ రోడ్డు తీవ్ర రద్దీగా ఉండడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కూలీలు ఎక్కువగా ఇదే రోడ్డులో ప్రయాణిస్తున్నారు. కాగా బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అకస్మాత్తుగా గోడ కూలిపోయి ఇటుకలు మీద పడ్డాయని బాధితులు చెప్పారు. కూలి పనికిపోయి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు వాపోయారు. జలమండల ట్రాన్స్‌మిషన్ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం నుంచే పురాతన గోడ పగుళ్ళ ద్వారా రోడ్డుపైకి నీళ్ళు పారుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. గాయాలపాలైన కూలీలను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
కార్పొరేటర్ సందర్శన : ప్రమాద విషయం తెలుసుకున్న మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్‌గౌడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గోడ కూలిన సంఘటనపై జలమండలి అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
యూత్ కాంగ్రెస్ ఆగ్రహం: జలమండలి అధికారుల నిర్లక్ష్యంపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రవికుమార్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే శేరిలింగంపల్లి పరిధిలో అనేక సంఘటనలు జరుగుతున్నాయని రవికుమార్ ఆరోపించారు.