జాతీయ వార్తలు

ఆమెకు పది లక్షల పరిహారం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బిహార్‌లో ఓ అత్యాచార బాధితురాలికి పది లక్షల రూపాయల పరిహారం అందించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలు ప్రస్తుతం ఆరునెలల గర్భవతి. ఆమె 17 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్‌కు పాట్నా హైకోర్టు అనుమతించలేదు. దీంతో ఇప్పుడు అబార్షన్ చేస్తే ఆమెకు, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి అనాధగా మిగిలిపోయిన ఆమెకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాల్సిందిగా జస్టిస్ దీపక్ మిశ్రా సారధ్యంలో సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది. బిహార్ రాజధాని పాట్నా వీధిలో ఆమె అత్యాచారానికి గురైంది. ఇప్పుడామె ఆరువారాల గర్భవతి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే 35 ఏళ్ల ఈ బాధితురాలికి హెచ్‌ఐవి సోకింది. కేసును విచారించిన సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ మెడికల్ బోర్డును నివేదిక అడిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో అబార్షన్ చేస్తే ప్రమాదమని బోర్డు తెలిపింది.