మెదక్

మెదక్‌లో అత్యధిక వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: గత రెండు రోజులుగా ఎడ తెరపి లేకుండా మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జనజీవన స్రవంతి స్థంభించిపోయింది. ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు మాత్రమే పట్టణాలకు వస్తున్నారు. గ్రామాలన్నియు తడిసి ముద్దయ్యాయి. జిల్లా కేంద్రం మెదక్ తడిసి ముద్దయింది. రోడ్లన్ని చిత్తడిగా మారాయి. రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే రైతులకు మాత్రం ఈ వర్షం ఊపిరినిచ్చింది. వేసిన వరి పంటలకు వర్షాలు ప్రాణం పోసింది. ఆరుతడి పంటలకు కూడా ఎంతో మేలు కలిగించింది. అయితే భారీ వర్షాలు కురియకుండా చిరు జల్లులతో కూడిన నిరంతరం కురియడం వలన ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడింది. మెదక్ జిల్లాలో ఆదివారం నాటికి 4.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టరేట్ ప్రకటించింది. అత్యధిక వర్షపాతం మెదక్‌లో కురియగా, అత్యల్ప వర్షపాతం చిన్నశంకరంపేటలో నమోదైనట్లు తెలిపారు. మెదక్‌లో 79.5 మి.మీ వర్షపాతం నమోదైంది. రేగోడ్‌లో 70.5, హావేళి ఘణాపూర్‌లో 65.17, పెద్దశంకరంపేటలో 64.4, నార్సింగిలో 58.5, నిజాంపేటలో 56.2, టేక్మాల్‌లో 52.3, రామాయంపేటలో 50.4, చేగుంటలో 48.35, అల్లాదుర్గంలో 46.27, పాపన్నపేటలో 42.4, చిలిపిచెడ్‌లో 33.5, కౌడిపల్లిలో 37.5, తూప్రాన్‌లో 29.47, నర్సాపూర్‌లో 25.75, మనోహరాబాద్‌లో 25.6, శివ్వంపేటలో 23.4, వెల్దుర్తిలో 22.6, కొల్చారంలో 18.85, చిన్నశంకరంపేటలో 15.6 మి.మీ వంతున వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ వెల్లడించింది.

శ్రీ వేంకటేశ్వర క్షేత్రంలో స్వామివారి కల్యాణ మహోత్సవం
గజ్వేల్: గజ్వేల్ పట్టనంలోని శ్రీ వెంకటేశ్వర క్షేత్రంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు శేషం శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో జరగగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతోపాటు శ్రీ లక్ష్మి, పద్మావతి సమేతులైన శ్రీ వెంకటేశ్వరస్వామివారిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణవేదికపై అదిష్టింపజేశారు. సుమారు 2 గంటల పాటు స్వామివారి కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా జరగగా, శ్రావనమాస పర్వ దినాలను పురస్కరించుకొని స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు బుక్కా వెంకటేశంగుప్తా పేర్కొన్నారు.

ఫారుఖ్‌హుస్సేన్ శిఖండి మాటలు మానుకోవాలి
సిద్దిపేట టౌన్: కాగ్రెస్ పార్టీ మాజీ ప్రభుత్వ విఫ్ జగ్గారెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌కు లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చొప్పదండి చంద్రశేఖర్, డిసిసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు వనం సంద్యారాణి అన్నారు. ఆదివారం నాడు వారు విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిక్షతోనే ఫారుఖ్‌హుస్సేన్ ఈ స్థాయికి వచ్చిన విషయం మరిచిపోయి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, నేతలపై విమర్శలు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్‌ఎస్‌కు కోవర్టుగా పనిచేస్తున్నాడని, ఎమ్మెల్సీకి వచ్చిన ఫండ్‌ను కాంగ్రెస్ పార్టీ వారికి కాదని, టిఆర్‌ఎస్ వారికి పర్సెంటెజ్‌లను అమ్ముకుసంటున్నారని గ్రహించి ఆదిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చూస్తే అది గ్రహించి టిఆర్‌ఎస్‌లోకి వెల్లారన్నారు. ఇప్పడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఫారుఖ్‌హుస్సేన్ ప్రజాదరణ లేని మనిషి, ప్రజాదరణ కలిగిన పార్టీ, నేతలపై అనవసర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తు ఊరుకోరన్నారు.
జగ్గారెడ్డి హాయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అనేక ప్యాక్టరీలు ఏర్పాటు చేయించి నిరుద్యోగ సమస్య తీర్చారన్నారు. మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో ఎన్ని ప్యాక్టరులు ఏర్పాటు చేశారు, ఎంత మంది నిరుద్యోగ సమస్య తీర్చారని ప్రశ్నించారు. మాటలు మాట్లాడలంటే ఎంతైన మాట్లాడోచ్చని, మాట్లాడే టప్పుడు ఎవరిపై మాట్లాడుతున్నాము, ఏమి మాట్లాడుతున్నామో అర్థంతో మాట్లాడాలన్నారు. అనవసరమైన విమర్శలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మహేందర్, నరేష్, రాజు, శేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రావణ పూజలందుకున్న వనదుర్గామాత
పాపన్నపేట: ఎల్లలుదాటి భక్తజనులను ఆకర్షిస్తూ చెరగని విశ్వాసాలకు ప్రతీకగా...అశేష భక్తజనులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఏడుపాయల వనదుర్గ్భావానిమాత ఆలయం భాషిల్లుతుంది. ప్రపంచంలోనే రెండవ వనదుర్గామాతగా, తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్దిగాంచిన అతి ముఖ్యమైన దేవాలయంగా ఏడుపాయల వనదుర్గామాత భక్తజనులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ఏడుపాయల్లో ఉన్న శివాలయం, సాక్షి గణపతి ఆలయం, గంగాభవాని, ఎల్లమ్మ, ముత్యాలమ్మలను కూడా భక్తులు కొలుస్తారు. ఆదివారం రోజు భక్తులు వనదుర్గామాత సన్నిదిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర నదీపాయల్లో, షవర్ బాత్‌లు, చెక్ డ్యామ్‌లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఉదయం నుండి వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అలయ అర్చకులు అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. అమ్మవారిని ఆలయ గర్భాలయంలో అలయ అర్చకులు ఆకుపచ్చని పట్టు వస్త్రంలో, ఆపిల్, పైనాఫిల్, బత్తాయి, గుమ్మడికాయ, కర్భుజ పండ్లు, నిమ్మ దండలతో అత్యంత సుందరంగా అలంకరించారు. గర్భాలయంలో వనదుర్గామాత అమ్మవారు దీప కాంతుల మధ్య కోటి సూర్యప్రభ విద్యుత్ కాంతులతో బంగారు వర్ణంలో దగదగలాడుతూ భక్తజనావళికి దర్శనమిచ్చింది. డప్పుచప్పులు, బ్యాండ్ మేళాల మధ్య భారీ బోనాల ఉరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో క్యూలైన్ల ద్వారా వనదుర్గామాతను భక్తిశ్రద్దలతో దర్శించుకున్నారు. మహిళా భక్తులు నెత్తిని విరబోసుకొని ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు రాసుకొని వేప కొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు చేతిలో కొరడా పట్టుకొని నెత్తిపై బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు చూస్తూ భక్తులు మంత్రముగ్దులయ్యారు. భక్తులు దుర్గామాత అమ్మవారికి బోనాలు, కొబ్బరికాయలు, తలనీలాలు, అమ్మవారికి చీరలను, గాజులను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. కొందరు భక్తులు సంతాన ప్రాప్తి కలగాలని అమ్మవారి సన్నిదిలోని సంతాన గుండంలో దంపతులు పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. బక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటి చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది చల్లా గోపాల్, రవికుమార్, శ్రీనివాస్, పి.మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, భక్తులకు తమతమ సేవలందించారు.

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
కౌడిపల్లి: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని స్థానిక ఎస్.ఐ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాడు కౌడిపల్లిలోని లక్ష్మీనర్సింహ్మా ఫంక్షన్ హల్‌లో నిర్వహించిన మండల శాంతి సంఘం కమిటీ సమావేశంలో మాట్లాడారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేవారు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజే సౌండ్ నిషేధమని ఏవరైనా డీజే సౌండ్ ఏర్పాటు చేసినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండపాల వద్ద నిర్వహకులు రాత్రి పూట తప్పనిసరిగా ఉండాలని, ఆశ్లీల పాటలు, డ్యాన్సులు చేయకూడదని అన్నారు. మండపాల నిర్వహకులు విద్యుత్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొమ్మిది రోజులకు మించి ఉత్సవాలను నిర్వహించవద్దన్నారు. అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపారు. మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకున్నా నిర్వహకులు భాద్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
వినాయకుడి నిమిజ్జనం ఉరేగింపు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సబ్-ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యాక్షులు సున్నం సతీష్, వివిధ గ్రామాల సర్పంచులు, మండపాల నిర్వహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

భారత సిపాయిగా పనిచేయడం గర్వకారణం
మెదక్: భారత సైనికుడు కుమార్‌గౌడ్ గత 20 సంవత్సరాలుగా యుద్ద భూమిలో కొనసాగుతున్నారు. కుమార్‌గౌడ్ మెదక్ జిల్లా మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన కిష్టాగౌడ్ కుమారుడు. ఇటీవల సెలవుపైన స్వగ్రామానికి చేరుకున్నాడు. పాకిస్తాన్, భారతదేశం మధ్య జరుగుతున్న యుద్ద ప్రణాళికను ఆంధ్రభూమితో ఆదివారం పంచుకున్నారు. 1997లో బోఫార్స్ కంపెనీ ఆర్మీలో జవాన్‌గా ఆయన చేరారు. ప్రస్తుతం ఆర్మీలో హౌల్‌దారుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 1999లో కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్, భారతదేశం మధ్య జరిగిన పోరులో భారత జవాన్లు రెండు వేల మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 2003లో కాశ్మీర్ ఇండియా మధ్య జరిగిన యుద్దంలో భారతీయులు వెయ్యి మంది మరణించినట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్‌కు గ్రాస్ సెక్టార్ 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్, ఇండియాకు మధ్య యుద్దం జరిగినట్లు ఆయన తెలిపారు. 2005లో తనకు లాస్ నాయక్‌గా మొదటి పదోన్నతి వచ్చినట్లు తెలిపారు. 2007లో నాయక్ పదోన్నతి వచ్చిందన్నారు. 2009లో హౌల్‌దార్ పదోన్నతి వచ్చినట్లు తెలిపారు. పగలంతా ఎక్సైజ్ తదితర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాత్రిళ్లు మాత్రం పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. కాశ్మీర్‌కు కంచె లేదన్నారు. రాజస్తాన్, పంజాబ్‌కు కంచె ఉందని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లు, ఇండియన్‌ల మధ్య జరుగుతున్న యుద్ద భూమికి గొర్ల కాపరులు సమాచారం అందిస్తారని ఆయన తెలిపారు. గొర్ల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు సిఫాయిలు సిద్దంగా ఉండి పాకిస్తాన్‌తో పోరాటడం జరుగుతుందన్నారు. 2003లో జరిగిన యుద్దంలో తన కుడి తొడకు బులెట్ దిగినట్లు ఆయన తెలిపారు. ఆ గాయాన్ని కూడా చూపించారు. ఏడాదికి ఎనిమిది సార్లు మాత్రమే సెలవులు ఇస్తారని తెలిపారు. ఆ సెలవులు సద్వినియోగం చేసుకొని సమయానుకూలంగా తిరిగి చేరకపోతే చర్యలు ఉంటాయన్నారు. ముఖ్యంగా హౌల్‌దార్‌గా తన క్రింద 20 మంది సిఫాయిలు ఉంటారని తెలిపారు. ఎక్కువగా యుద్ద భూమిలో ఏకె-47 తుపాకులు ఉంటాయన్నారు. ఈ రెండు ఆయుధాలు 700 గజాల దూరం వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం మెదక్ పురపాలక సంఘం చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్‌ను కలుసుకొని ఈ విషయాలన్నింటిని ఆయనతో పాటు ఆంధ్రభూమితో పంచుకున్నారు. తనకు ఇద్దరు సంతానం ఉందని ఆయన వివరించారు. యుద్ద భూమే తన స్వర్గంగా ఎంచుకొని భారతదేశానికి సేవ చేయాలన్నదే తమ లక్ష్య సాధనమని కుమార్‌గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ అభినందించారు.

ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలు
కౌడిపల్లి: కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లో సాక్షర భారత్ ఆధ్వర్యంలో రెండో విడత ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలను ఆదివారం నాడు నిర్వహించారు. కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లోని 28 గ్రామపంచాయతీల్లో ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 280 మంది పరీక్షా రాయాల్సి ఉండగా 230 మంది అభ్యాసకులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎన్‌ఐఓఎస్ పర్యవేక్షకురాలు విజయలక్ష్మీ, ఎపిఓలు గోవింద్‌రావు, ఉమాలు పరీశిలించారు. మండల సాక్షర భారత్ సమన్వయకర్త శంకర్ ఆధ్వర్యంలో అభాస్యకులు ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలు రాశారు.

ముత్తాయికోటలో ముగిసిన జలాభిషేకం
* నేడు శ్రీసిద్దేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేకాలు
మెదక్ రూరల్: వర్షాలు సమృద్దిగా కురవాలని ఆకాంక్షిస్తు ప్రసిద్ద ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వరాలయంలో ఈ నెల 19 సాయంత్రం 7 గంటల నుండి 24 గంటలపాటు జలాభిషేకం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఆలయ ప్రధాన పూజారి గోవింద్ మహారాజ్ ఆధ్వర్యంలో లోకకళ్యాణార్దం నిర్వహించిన జలాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి అంతయు భజన కార్యక్రమాలు నిర్వహించారు. మాసశివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రం 7 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. 21న శ్రావణమాసం చివరిరోజు, అమావాస్య సోమవారం కలిసి రావడంతో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేక, అలంకార పూజలు, అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వర్షం...హర్షం
* పారుతున్న కాల్వలు.. నిండుకుంటున్న చెర్వులు
మెదక్ రూరల్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతతోపాటు అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మహబూబ్‌నహర్ కాలువ పారడంతో చెర్వులు, కుంటలు నిండుకుంటున్నాయి. రాజ్‌పేట వాగు పెద్దయెత్తున పారుతుండడంతో జిల్లా సరిహద్దులోగల పోచారం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలో ఉండగా నీటిమట్టం 14 అడుగులకు చేరింది. రాజ్‌పేట బ్రిడ్జీ పాత బ్రిడ్జీ స్లాబును ఆనుకుని పారుతుంది. దీంతో కొత్త వంతెన నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాలతో మెదక్, హవేళీఘణాపూర్ మండలాల్లో చెర్వులు, కుంటల్లో నీరుచేరుతుండగా పంటపొలాల్లో సైతం నీరు చేరాయి. ముసురుతో కూడిన వర్షం కురవడంతోపాటు చల్లని గాలులు వీయడంతో వృద్దులు, చిన్నపిల్లలు వణుకుపట్టారు. కురుస్తున్న వర్షం రైతాంగానికి ఊరటనిచ్చింది.
జోగిపేటలో భారీ వర్షం
జోగిపేట: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో గత రెండు రోజులుగా జోగిపేట ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పట్టణంలోని రోడ్లన్ని చిత్తడిమయంగా మారాయి. అందోల్, పుల్కల్, వట్‌పల్లి తదితర మండలాల్లోని చెరువు, కుంటలకు వర్షపు నీరు వచ్చి చేరుతుంది. మొక్కజొన్న, వరి, పత్తి, కూరగాయల పంటలకు ఈ వర్షం వల్ల మరింత ఎదుగుదల ఉంటుందని రైతన్నలు భావిస్తున్నారు. తుఫాన్ వల్ల మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మరో మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ఇండ్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ వానలకే చాలా చోట్ల రోడ్లు నడవలేని పరిస్థితి నెలకొంది. జోగిపేట పట్టణంలో మాత్రం రోడ్లపైనే నీళ్లు ప్రవహించాయి. మొయిన్ రోడ్డులో మురికి కాలువ లేకపోవడం వల్ల వర్షాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. ఏది ఏమైనప్పటికీ వర్షాలు రైతన్నలకు మేలు చేసినట్లు చెప్పవచ్చును.

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం
టేక్మాల్: టేక్మాల్ మండల పరిధిలోని ధన్నుర శివారులో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ విశే్వశ్వర ఆలయంలో ఆదివారం రోజు శివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చని పందిళ్లు వేసి ఆనందంగా ముస్తాబు చేశారు. ఆయా గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి భక్తులు తరించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, సఖల సుభాలు కలగాలని, లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణం చేసినట్లు ఆయన పూజారి అంజయ్య స్వామి తెలిపారు. అఖండ శివపంచాక్షరి నామభజన కార్యక్రమం రెండు రోజులుగా కొనసాగుతుంది.