మెదక్

2న బటర్‌ఫ్లై లైట్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మెదక్ పురపాలక సంఘంలో గంగినేణి థియోటర్ నుండి గంగమ్మ ఆలయం వరకు 22 బటర్‌ప్లై లైట్లను ఈ నెల 22న ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభిస్తున్నట్లు మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్ ఆదివారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఎంపి ఆనంద భాస్కర్ ఇచ్చిన ఎల్‌ఇడి బల్బులను కూడా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కురుస్తున్న వర్షాలతో కార్బన్ వచ్చి వెలగని లైట్లను రిపేర్ చేస్తామని ఆయన తెలిపారు. పండుగల సీజన్ ప్రారంభమైందని తెలిపారు. వినాయక చవితి, బతుకమ్మ, దీపావళి, క్రిస్మస్ పండుగలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పండుగలన్నింటికి కూడా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్‌లో ఎలాంటి వ్యాధులు ప్రభలకుండా, దోమలను నివారించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. మెదక్ పట్టణంలోని 27 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు పారిశుద్య పనులపైన దోమల బెడద, పందులు, కుక్కల, కోతుల బెడదను తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ విషయంలో కూడా మున్సిపల్ కమీషనర్ ప్రసాద్‌రావు, ఇంజనీర్ చిరంజీవితో చర్చించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు వీటి భారీన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. వర్షానికి రోడ్లు గుంతలు పడి వాహనదారులకు ప్రజలకు ఇబ్బందిగా మారిన విషయాన్ని అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో నడుస్తున్న పైప్‌లైన్ల నిర్మాణాలు రోడ్లకు కొంత అనివార్య కార్యక్రమాలు చోటు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పైప్‌లైన్లు పూర్తి చేసిన వెంటనే రోడ్ల మరమత్తులు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణంలో నాలుగు జోన్‌లుగా విభజించుకొని డిసెంబర్ 31 వరకు అన్ని రకాల పైప్‌లైన్లు పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్‌తో చర్చించడం జరుగుతుందన్నారు. రాందాస్ చౌరస్తాలో ఏర్పడిన రోడ్డు చిత్తడిని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ రోడ్డును త్వరలో మరమత్తులు నిర్వహించి ప్రయాణీకులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ప్రసాద్‌రావు, ఇంజనీర్ చిరంజీవి, తెరాస ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, దాయర రాజు, దుర్గేశ్ పాల్గొన్నారు.