ఖమ్మం

నయనానందకరం.. శ్రీరామ కళ్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారు ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ఈ రూపంలో చూడముచ్చడగా సాక్షాత్కరించిన రామయ్యను కనులారా వీక్షించిన భక్తజనం ప్రణమిల్లారు. జై శ్రీరామ్ అంటూ నీరాజనాలు పలికి ఆరాధించారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతులైన దేవదేవుడు సుందరంగా కనిపించి పరమానంద భరితులను చేశాడు. ప్రధానాలయంలో మూలమూర్తులకు సుప్రభాతం పలికి ఆరాధన జరిపి అర్చకులు నామార్చనలు చేశారు. క్షేత్ర విశిష్టతను వైదిక పెద్దలు ప్రవచనం చేశారు. వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు జరిపి నిత్య కల్యాణ ఘట్టం గురించి వివరిస్తుండగా ఈ క్రతువును అర్చకులు వైభవోపేతంగా జరిపారు. భద్రాచలంలో శ్రీరామదర్శనం ఎంతో పుణ్యం ప్రసాదిస్తుందన్నారు. ఇక్కడ అన్నదానం చేస్తే శుభాలు సిద్ధిస్తాయని వివరించారు. అనంతరం విశ్వక్సేన పూజ జరిపి పుణ్యాహవచనం నిర్వహించి కంకణధారణ చేశారు. స్వామికి వకన్యాదానం జరిపి ప్రవర పఠించారు. యోక్త్ధ్రారణ చేసి మాంగళ్యధారణ జరిపారు. అనంతరం తలంబ్రాల వేడుక భక్త్భివాలను పెంచింది. దర్బారుసేవలో ఆలపించిన కీర్తనలు మంత్రముగ్థులను చేశాయి.