ఖమ్మం

సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం షెడ్యూల్‌ను డెప్యూటి చీఫ్ లేబర్ కమిషనర్ కెకెహెచ్ యం శ్యామ్‌సుందర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని డిప్యూటి చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్)తో యాజమాన్యం, కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నిక షెడ్యూలును ప్రకటించారు. అక్టోర్ 5వ తేదీన సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీలోపు సింగరేణి యాజమాన్యం ఓటరు జాబితాను కార్మిక సంఘాలకు అందజేయనుంది. సెప్టెంబర్ 6వ తేదీలోపు ఓటరు జాబితాపై అభ్యంతరాలను ఎన్నికల అధికారికి తెలియజేయాలని తెలిపింది. ఓటర్ల జాబితాపై కార్మిక సంఘాల అభ్యంతరాలను 9వ తేదీన ఎన్నికల రిటర్నీంగ్ అధికారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సెప్టెంబర్ 14 నుండి 16వ తేదీ వరకు నామినేన్లు దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 19ని చివరి తేదీగా నిర్ణయించారు. 20వ తేదీన కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. అక్టోబర్ 5వ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 7 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారని డెప్యూటి చీఫ్ లేబర్ కమీషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రీజనల్ లేబర్ కమీషనర్ రామన్, సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్, జనరల్ మేనేజర్ ఎ ఆనందరావు, ఎస్ ఒటు డైరెక్టర్ పా మురళికుసాగర్ కుమార్, డెప్యూటి జనరల్ మేనేజర్లు ఎన్ అనిల్ కుమార్, కవిత నాయుడు, తోపాటు 16 కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.