హైదరాబాద్

రామంతాపూర్‌లో జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి కార్పొరేటర్లు గంధం జ్యోత్స్న, మేకల అనలారెడ్డి, డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు, ఈఈ రాజయ్య, ఎసిపి నాగిరెడ్డి, ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, రెవిన్యూ విభాగం అధికారులతో కలిసి సోమవారం రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో పర్యటించారు. కాలనీలలో విస్తృతంగా పాదయాత్ర ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షానికి దెబ్బతిన్న రహదార్లు, పారిశుద్ధ్యం, పొంగుతున్న డ్రైనేజీ సమస్యలను గుర్తించారు.
రోడ్ల మరమ్మతులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్ నల్లచెరువులో గణేష్, బతుకమ్మ నిమ్జనం కోసం ఏర్పాటు చేసిన కొలను నిర్మాణం పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తానని జోనల్ కమిషనర్ గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, ఆరోగ్య పారిశుద్ధ్య విభాగం ఉప్పల్-2 ఆధ్వర్యంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోమవారం రామంతాపూర్, ఉప్పల్‌లో ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్యం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉగ్రవాద రహిత దేశం
హైదరాబాద్: భారతదేశాన్ని 2022 నాటికి ప్రపంచంలోనే అగ్రభాగాన నిలపాలన్నదే ప్రధాని నరేంద్రమోదీ సంకల్పమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. చైనా పాకిస్థాన్‌లు కలిసి దేశంలో చిచ్చు పెట్టాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. దేశాన్ని ఉగ్రవాద రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుంబిగిస్తోందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. 75వ క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈఎస్‌ఐసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తిరంగ యాత్ర నిర్వహించారు. ఎల్బీస్టేడియం ఎదుట ఉన్న బాబూజగజ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం దత్తాత్రేయ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఎల్బీస్టేడియం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు ఈఎస్‌ఐసి మెడికల్ కళాశాల వైద్యులు, వైద్య విద్యార్ధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ఉప్పల్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం రామంతాపూర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపకుడు తిండేరు హన్మంతారావు ఆధ్వర్యంలో మండప నిర్వాహకుల సమావేశం జరిగింది. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ విజయవంతం చేయాలని పేర్కొన్నారు. మండపాల వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సహకరిస్తారని తెలిపారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి నాయకులు బుచ్చిరెడ్డి, ఓబుల్‌కుమార్, కె.రమేశ్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి హబ్సిగూడ కన్వీనర్‌గా సోమ శ్రీనివాస్, కోకన్వీనర్లుగా సుమన్‌రావు, పి.నగేష్ గుప్త, రామంతాపూర్ కన్వీనర్‌గా నాగరాజు, కోకన్వీనర్లుగా ఆర్.బీరప్ప, ఆర్‌వి శేఖర్‌లను ఎంపిక చేసినట్లు తిండేరు హన్మంతరావు ప్రకటించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మేడిపల్లి అధ్యక్షుడిగా చిత్తరంజన్‌రెడ్డి
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బోడుప్పల్, పీర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి, చెంగిచర్ల ప్రాంతాలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీను ఏర్పాటు చేశారు. ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యులు రేవెల్లి రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఉత్సవ సమితి మేడిపల్లి భాగ్ కన్వీనర్‌గా ఎం.చిత్తరంజన్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా బండారు పవన్‌రెడ్డి, డివిజన్ ఇన్‌చార్జిగా మద్ది యుగంధర్‌రెడ్డి, కోశాధికారిగా రాజు, కోకన్వీనర్లుగా సుశాంత్ గౌడ్, దినేష్‌చారి, రాసాల మహేష్, ప్రభాకర్, రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈనెల 22న సాయంత్రం 4గంటలకు బోడుప్పల్ తిరుమల పద్మావతి గార్డెన్స్‌లో గణేష్ మండప నిర్వాహకుల సమావేశం జరుగుతుందన్నారు. మండప నిర్వాహకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మట్టి వినాయకులే ముద్దు
రాజేంద్రనగర్: మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ పి.గీతారెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హానికర రసాయనాలు, రంగులతో పోటాపోటీగా అతిపెద్ద విగ్రహాలను తయారు చేస్తూ వాటిని నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. దీంతో నీటిలో నివసించే ప్రాణులకు ప్రాణవాయువు అందక చనిపోతున్నాయని చెప్పారు. ప్రజలు ఆ నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా వాతావరణ, నీటి కలుష్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సహజసిద్ధమైన రంగులను ఉత్పత్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన హోమ్‌సైన్స్ కాలేజీ వారికి అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ వా జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రాజెక్టు(నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు) క్రింద ‘‘ఏ వాల్యూ చైన్ ఇన్ నాచురల్ డైస్’’ అనే ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టును మంజూరు చేశామని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో బట్టలకు అవసరమైన సహజ రంగులను తయారు చేయడమే కాకుండా, వినాయక విగ్రహాలకు సహజ రంగులను వేసుకోవడానికి 25 టన్నుల సహజసిద్ధ రంగులను ఉత్పత్తి చేసి తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌జీవోలకు అందజేస్తుందని తెలిపారు. ఈ రంగులను ఉపయోగించి 2 లక్షలకుపైగా వినాయక విగ్రహాలను, సహజ రంగుల్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సైఫాబాద్ గృహవిజ్ఞాన కళాశాలలో కూడా వినాయక విగ్రహాలకు సహాజ రంగులు వేసి అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సహజ సిద్ధ రంగుల వాడకంలో మెళకువలు, వాడడంతో కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలనే భావనతో అనేక అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ అవగాహన ఏర్పరచుకొని వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం తగ్గించి ప్రాణావాయువును వృద్ధి చేసి మానవాళి మనుగడను సుఖవంతం చేసుకోవడానికి చేయి, చేయి కలిపి సహాజ సిద్ధ రంగులతో చేయబడిన గణనాథులను పూజించాలని కోరారు.
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
మట్టి విగ్రహాలనే ప్రతిష్టించుకోవాలని జనహిత వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వెల్లడించారు. సోమవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో తిరుగుతూ విద్యార్థులతో కలిసి అవగాహన కల్పించారు. జనహిత సొసైటీ సభ్యులు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే పర్యావరణానికి తోడ్పాటు అందించాలని అన్నారు. పర్యావరణం పాడయ్యేందుకు కారకాలైన రంగురంగుల విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని చెప్పారు.

నిమజ్జనం ఎలా?
చెరువులను పరిశీలించిన అధికార బృందం
జీడిమెట్ల: గణేశ్ నిమజ్జనం చేసే చెరువులను అధికార బృందం సోమవారం పరిశీలించారు. సూరారం కట్టమైసమ్మ చెరువును కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ భూపాల్, దుందిగల్ సిఐ శంకరయ్య, విద్యుత్, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. సుచిత్ర, వెనె్నలగడ్డలోని ఎన్నా చెరువును పేట్‌బషీరాబాద్ ఎసిపి శ్రీనివాస్‌రావు, కుత్బుల్లాపూర్ ఉపకమిషనర్ సుదాంశ్, సిఐ రవిచంద్ర పరిశీలించారు. గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని అధికారులు చెప్పారు.

ప్రయాణం గగనమే!

జీడిమెట్ల: సుభాష్‌నగర్ డివిజన్ సూరారం కాలనీ రాజీవ్ గృహ కల్పకు వెళ్లే ప్రధాన రహదారి మరీ అధ్వాన్నంగా మారింది. ఇటీవల మంచినీటి పైపులైన్‌ల నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో త్రవ్వకాలు చేశారు. ఆ తరువాత పూడ్చేసిన అధికారులు మళ్లీ రోడ్డును వేయడం మరిచిపోయారు. దీంతో సుమారు నాలుగు నెలలుగా రహదారిలో వాహనాలు రాకపోకలు సాగించాలంటే వాహనదారులు నరకాన్ని చవిచూస్తున్నారు. సూరారం కాలనీ ఓమ్ జెండా నుండి ఆర్‌జికెకు వెళ్లే మార్గంలో తెలుగుతల్లినగర్, 60 గజాల బస్తీ వరకు తవ్వకాలు చేశారు. ఒక్క ఆటో వెళ్లిందంటే మరో వాహనం రావడానికి అసలు వీలు లేకుండా రోడ్డు మారింది. ఆటో వెళితే ద్విచక్ర వాహనదారుడు సైతం ప్రక్కన ఆగాల్సిందే. ఎదురెదురుగా రెండు ఆటోలు వస్తే తప్పనిసరిగా ఓ ఆటో ఆపితేనే మరో ఆటో వెళ్తుంది. ఇక లారీలు, కార్లు వచ్చాయంటే అంతే సంగతులు. ఈ రకంగా రోడ్డు మారినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచినీటి పైపులైన్‌ల నిర్మాణం కోసం తవ్విన రోడ్డును తక్షణమే రోడ్డును వేయాలి లేదా కనీసం వాహనాలు రాకపోకలు సాగేలా తాత్కాలిక చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నెలలు గడుస్తున్నా రోడ్డును బాగుచేయాలన్న ఆలోచన రాకపోవడం శోచనీయం. సూరారం కాలనీ నుండి రాజీవ్ గృహకల్పకు ప్రజలు రాకపోకలు సాగించాలంటే నరకాన్ని చవిచూస్తున్నారు. గోతులు లేని రోడ్డు సూరారం కాలనీలో కనిపించదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం రోడ్డు విషయాన్ని పట్టించుకోవడం లేరని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని వాహనదారులు, ఆర్‌జికె ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన
ఖైరతాబాద్: వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ప్రవచన కర్త మైలవరపు శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో 800 మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 8:30 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి.
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, కార్పొరేటర్ విజయారెడ్డి, వాసవీ సేవా కేంద్రం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, రాజశేఖర్ పాల్గొన్నారు.

సుబ్బలక్ష్మికి మాలతీ చందూర్ పురస్కారం
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మికి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రదానం చేసారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సత్కరించి పురస్కారం ప్రదానం చేసారు. రోశయ్య మాట్లాడుతూ సుబ్బలక్ష్మితో తనకు పరిచయం లేదని, మాలతీ చందూర్ రచనలు మాత్రం కోన్ని చదివానని, రచనల ద్వారా చిరస్మరణీయురాలని అన్నారు. కార్యక్రమంలో పాత్రికేయుడు డి.వెంకట్రామయ్య, సాహితీవేత్త డా.మృణాళిని, కె.శంకరరావు, మాలతీ చందూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అప్రజాస్వామిక విధానాలపై రాష్టప్రతిని కలుద్దాం

ఖైరతాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలపై రాష్టప్రతిని కలిసి విన్నవిద్దామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో ‘నేరెళ్ల సంఘటన’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జెఎసి రాష్ట్ర కార్యదర్శి కొమ్ము తిరపతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, నాయకులు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, రమేష్, గద్దల అంజిబాబు, శంకర్, అజయ్, సంజీవ్ నాయక్, శ్రీకాంత్ హాజరయ్యారు. తెలంగాణలో నిరంకుశ, రాచరిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో నిజాం తరహాలో కెసిఆర్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజా హక్కులను కాలరాస్తున్నారని, ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో దళితులు, బిసిలను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక లారీల వల్ల ప్రాణాలు పోతున్నాయని స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటుచేయడంతో లారీలపై నియంత్రణ విధించాలని కోరడమే నేరెళ్ల వాసులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. పది మంది మృతిచెందినా బాధిత కుటుంబాల ఆర్తనాదాలు వినని ప్రభుత్వం, లారీలను అడ్డుకున్నారన్న నెపంతో పశువుల కంటే దారుణంగా కొట్టారని వాపోయారు. పోలీసులచే రాజ్యాన్ని పాలించాలని కెసిఆర్ చూస్తున్నారని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో ఇసుక లారీల వల్ల రాష్టవ్య్రాప్తంగా 43 మంది మృతిచెందితే ప్రభుత్వం తరఫున వారికి సహాయం అందించకపోగా బాధితులనే దోషులుగా చిత్రీకరించడం సిగ్గుచేటని అన్నారు. నేరెళ్లలో పోలీసులు చట్టానికి విరుద్ధంగా బాధితులపై కేసులు నమోదు చేయడమే కాక వారిని తీవ్రంగా విమర్శించారని అన్నారు. పోలీసుల అదుపులో చిత్రహింసలకు గురవుతున్న వారి కుటుంబ సభ్యులు వెళ్లి తమ వారిని వదిలివేయాలని కోరితే వ్యభిచారం కేసులు పెడతామని బెదిరించడమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కెసిఆర్ మూడేళ్ల పాలనలో అన్ని వర్గాల వారు అణిచివేతలకు గురతున్నారని, ప్రజల పక్షాన మాట్లాడిన వారిని, సమస్యలు పరిష్కరించాలని కోరే వారిని దోషులుగా చూపుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, పోలీసులచే చిత్రహింసలకు గురైన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్లతో ఈనెల 31న ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా హక్కుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని భారత రాష్టప్రతి, కేంద్ర హోంశాఖ, జాతీయ ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌లను విన్నవిస్తామని చెప్పారు.

చతుర్విదాభినయాల సమ్మేళనమే నృత్యం
హైదరాబాద్: నృత్యానికి ఆంగికాభినయం, వాచికాభినయం, సాత్వికాభినయం, ఆహార్యాభినయం ముఖ్యమని ప్రాంతాల శాస్ర్తియాన్ని బట్టి కొన్ని మార్పులు కనిపిస్తుంటాయని ప్రముఖ నాట్యాచారిణి డా.పి.రమాదేవి అన్నారు. శ్రీ సాయినటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జక్కుల పురంధ్రి దరువు అంశాన్ని ఉపన్యాస సహిత అభినయంతో ప్రదర్శించారు. పారిజాతాపహరణం అనే నృత్యకావ్యంనుండే కలాపం అంశం ప్రారంభమైనాయని, సిద్ధేంద్ర యోగి పరిశోధనతో భామా కలాపం అంశం తెరపైకి వచ్చిందని అన్నారు. తనకు చిరుప్రాయంలో ప్రధమ గురువు మహంకాళి కృష్ణమోహన్ తరువాత నాట్యాచారిణి ప్రసన్న రాణి నేతృత్వంలో అనేక మెలకువలు నేర్చుకుని డా.ఉమారామారావు ప్రోత్సాహంతో పరిశోధనలు చేసానని రమాదేవి చెప్పారు. సర్ట్ఫికెట్ కోర్సుకు సంబంధించి సిలబస్‌తోపాటు ప్రాక్టికల్స్ అవసరమైన వివరాలతో 2000 సంవత్సరంలో మొదటి భాగం రాసానని, రెండవ భాగంగా ‘హిస్ట్రియానిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ కూచిపూడి డాన్స్’ పుస్తకాన్ని రాసానని చెప్పారు. ఈ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డా.ఆవుల మంజులత ఆవిష్కరించగా డా.పసుమర్తి శేషుబాబు, సినీ నటి నాట్యాచారిణి కె.ప్రసన్నరాణి, నృత్య గురువు డా.అనుపమా కైలాశ్ పాల్గొని రమాదేవిని అభినందించారు. తొలుత దరువు అంశాన్ని ప్రదర్శించారు. పసుమర్తి శేషుబాబు నట్టువాంగానికి, రేణుకా ప్రసాద్ మృదంగ సహకారంతోను, సాయి కోలంక వయొలిన్ వాయిద్యంతోను సహకరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

మియాపూర్‌లో వ్యభిచార గృహాలపై దాడులు

శేరిలింగంపల్లి: మియాపూర్‌లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మయూరినగర్‌లోని ప్లాట్ నెంబర్ 1126లోని ఇంటిలో గొల్ల ప్రవీణ్ (40) అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. మియాపూర్ ఎసిపి సంక్రాంతి రవికుమార్ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ చీమర్ల హరిశ్చంద్రారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ డి. అప్పారావు, సిబ్బంది అర్ధరాత్రి వెళ్ళి తనిఖీ చేశారు. ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లుకు చెందిన విటుడు బొల్ల శ్రీనివాస్ (44)తో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. దీప్తిశ్రీనగర్‌లోని ప్లాట్ నెంబర్ 120లో సంగారెడ్డిలోని బాబునగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకుని ముల్కలు సతీష్ ద్వారా వ్యభిచారం నడిపిస్తున్నాడు. విటుడు మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా, సిరొంచకు చెందిన ముల్దాకర్ శ్రీ్ధర్ (26), నిర్వాహకుడు సతీష్‌తో సహా బెంగాల్ చెందిన మహిళను పట్టుకున్నారు. వ్యభిచార గృహం నుంచి రూ. 8400 నగదు, ఒక కండోమ్ ప్యాకెట్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించారు. పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు పంపించారు. నిర్వాహకుడు లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అప్పారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అనుటెక్స్ వస్త్ర దుకాణంలో చోరీ

దిల్‌సుఖ్‌నగర్: కొత్తపేట్‌లోని అనుటెక్స్ వస్త్ర దుకాణంలో చోరి అయిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే డిజె ఫేమ్ పూజ హెగ్దే చేతుల మీదుగా కొత్తపేట్‌లో అనుటెక్స్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. గుర్తు తెలియని దుండుగలు ఆదివారం రాత్రి దుకాణం వెనుక వైపు ఉన్న వెంటిలెటర్‌ను తొలగించి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. తొమ్మిది లక్షల యాబై వేల రూపాయలు విలువ చేసే విలువైన వస్త్రాలను దొంగిలించారు. సోమవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా బట్టలన్నీ చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. నిర్వాహకుడు శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.