క్రీడాభూమి

ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోస్యం చెప్పాడు. రానున్న మూడు నెలల్లో రెండు పదులకుపైగా వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉన్నందున అతని ఆట గాడిలో పడుతుందన్న నమ్మకం తనకు ఉందని కోహ్లీ అన్నాడు. 2019 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచి జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కోహ్లీ తెలిపాడు. ధోనీసహా జట్టులోని ప్రతి ఒక్కరికీ తమతమ నైపుణ్యాన్ని, ఫామ్‌ను నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కుల్దీప్ యాదవ్ కంటే అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకోవడానికి కారణాలున్నాయని అన్నాడు. బౌలింగ్‌లోనేగాక, ఫీల్డింగ్‌లోనూ అక్షర్ సమర్థుడని చెప్పాడు. అంతేగాక, కుల్దీప్‌కు ఇంతకు ముందు అవకాశాలు ఇచ్చామని, ఇప్పుడు అక్షర్, యుజువేంద్ర చాహల్ తదితరుల వంతు వచ్చిందని వ్యాఖ్యానించాడు.