జాతీయ వార్తలు

రైల్వే బోర్డు చైర్మన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు జరిగినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రైల్వే బోర్డు అధ్యక్షుడు ఏకె మిట్టల్ కూడా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మిట్టల్ స్థానంలో కొత్త చైర్మన్‌గా ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహానిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా నియమితులైన లోహాని భారత రైల్వే మెకానికల్ ఇంజనీర్ల సర్వీసు అధికారి. సురేష్‌ప్రభు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే మోదీ ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కాస్త ఓపిక పట్టాల్సిందిగా సూచించారు. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇరవై మంది మరణించటంతో పాటు దాదాపు డెబ్భై మంది ప్రయాణికులు గాయపడటం తెలిసిందే. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా కాకుండానే మంగళవారం కైఫియాత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి పలువురు గాయపడ్డారు. మానవతప్పిదం మూలంగానే ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ రెండు రైలు ప్రమాదాలు తనను బాధకు గురి చేశాయని సురేష్‌ప్రభు ప్రధానిని కలిసిన అనంతరం ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో రైల్వే శాఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని అన్నారు. దశాబ్దాల నుండి నిర్లక్ష్యానికి గురవుతున్న రైల్వేను ఆధునీకీకరించేందుకు మోదీ నాయకత్వంలో ఎంతో పట్టుదలతో పని చేశానని, సంస్కరణలను అమలు చేశానని దాని వల్ల రైల్వేలలోని వివిధ శాఖల్లో కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. రెండు రైలు ప్రమాదాల్లో పలువురు మరణించటం, గాయపడటం తనను కలచి వేసిందని అందుకే తాను రాజీనామా చేస్తానని మోదీకి తెలియజేశానని ఆయన వివరించారు. తొందరపడకుండా వేచి చూడాలని నరేంద్ర మోదీ సూచించారని ఆయన ట్వీట్‌లో తెలిపారు.