జాతీయ వార్తలు

రాష్ట్రాలకు బదులు జోన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారుల్లో జాతీయ సమగ్రతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారుల కేడర్ కేటాయింపులకు సంబంధించి కొత్త పాలసీకి కేంద్రం తుది రూపమిస్తోంది. కొత్త విధానం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సర్వీసుల అధికారులు తాము పని చేయడానికి ఇప్పటిమాదిరి రాష్ట్రాలను కాక జోన్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతకు సంబంధించిన కొన్ని షరతులను నెరవేర్చిన తర్వాత వారిని సెంట్రల్ డిప్యుటేషన్‌పై వారు ఎంచుకొన్న జోన్లలో నియమిస్తుంది. కొత్త పాలసీలో ప్రస్తుతం ఉన్న 26 కేడర్‌లను అయిదు జోన్లుగా విభజిస్తారు. మొదటి జోన్‌లో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ఉంటాయి. అలాగే రెండో జోన్‌లో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, జోన్-3లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాలుగో జోన్‌లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ ఉంటాయి. జోన్-5 లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉంటాయి. కొత్త విధానం వల్ల ఉదాహరణకు బిహార్‌కు చెందిన అధికారులు తమ కిష్టమైన కేడర్‌లో కాకుండా దక్షిణాది, ఈశాన్య రాట్రల్లో పని చేసే అవకాశం లభిస్తుందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీనివల్ల అధికారులు తమ ప్రాంతంలో కాకుండా వేరే రాష్ట్రంలో పని చేయడానికి అవకాశం లభించడం వల్ల బ్యూరోక్రసీలో జాతీయ సమగ్రత ఉండేలా చూడడానికి వీలవుతుందని ఆ అధికారి చెప్పారు. అఖిల భారత సర్వీసులకు చెందిన అదికారులు తమకు కొత్తఅయిన రాష్ట్రాల్లో పని చేయడం వల్ల విస్తృతమైన అనుభవాన్ని సంపాదించుకుంటారని, ఆ అనుభవాలను తమ ప్రాంతాల్లో పని చేసేటప్పుడు వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి వీలవుతుందని, అఖిల భారత సర్వీసుల వెనుక ఉన్న హేతుబద్ధత కూడా ఇదేనని ఆ అధికారి చెప్పారు.
కొత్త విధానం ప్రకారం ప్రతి ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మొదటే తమకిష్టమైన జోన్లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేడర్‌ను కూడా ప్రాధాన్యతా క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థి జోన్, కేడర్‌లకు సంబంధించి ఎలాంటి ప్రిఫరెన్స్‌ను పేర్కొనకపోయిన పక్షంలో అతనికి ప్రత్యేకించి ఎలాంటి ప్రాధాన్యత లేదని భావించడం జరుగుతుందని కూడా ఆ అధికారి చెప్పారు.