జాతీయ వార్తలు

2వేల నోటు రద్దు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయటంలేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడిన ఆయన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రెండు వందల రూపాయల నోట్ల జారీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు. తక్కువ డినామినేషన్ కలిగిన కరెన్సీ కొరతను తీర్చాలనే ఉద్దేశంతోనే రెండు వందల రూపాయల నోట్లను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇవి ఎప్పటి నుంచి చెలామణిలోకి వస్తాయి, వాటి రంగు ఎలా ఉంటుందనే ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు. ఇదంతా రిజర్వు బ్యాంకు పరిధిలోని అంశం, దీనిపై రిజర్వు బ్యాంకు మాత్రమే చెప్పగలుగుతుందని ఆయన అన్నారు. కొత్త రెండు వందల రూపాయల నోట్లు త్వరలోనే చెలామణిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కరెన్సీ పరిస్థితిని మరింత మెరుగు పరచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. రెండు వందల రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తే అన్ని డినామినేషన్లలో కరెన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపాయి.