జాతీయ వార్తలు

నేడు మోదీ-దేవుబా విస్తృత చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకోసం బుధవారం న్యూడిల్లీ చేరుకొన్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గత జూన్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవుబా విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, గురువారం ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి. ‘్భరత్‌కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైన నేపాల్ ప్రధాని దేవుబాజీకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఒక ట్వీట్‌లో పేర్కొన్న ప్రధాని ఇద్దరూ ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు. గురువారం జరిగే చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలను కూడా చర్చిస్తారని తెలుస్తోంది.