జాతీయ వార్తలు

ర్యాలీని వాయిదా వేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో రాజధాని పాట్నాలో ఈ నెల 27న తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలన్న బిజెపి విజ్ఞప్తిని ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చారు. తమ ర్యాలీ వల్ల వరద బాధితులకు వచ్చే నష్టమేమిటని ఆయన ఎదురు ప్రశ్నించారు. బిజెపి సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ మాట్లాడుతూ వరదలతో 18 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైందని, సుమారు కోటిన్నర మంది వరద బారిన పడ్డారని అన్నారు. ఈ పరిస్థితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ర్యాలీ నిర్వహించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘వరద బీభత్సంతో అపారమైన నష్టం వాటిల్లింది. కాబట్టి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం సరైందికాదు. లాలూ వాయిదా వేసుకోవాలి’ అని మోదీ విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో వరదలకు 250 మంది మృతిచెందగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థనపై ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగానే స్పందించారు. ‘సుశీల్ మోదీ మా జోలికి రాకండి. మీ ఉచిత సలహాలు ఆర్జేడికి అక్కర్లేదు. మేం ర్యాలీ వాయిదా వేసుకుంటే బిహార్‌లో వరదలు ఆగిపోతాయా?’ అంటూ లాలూ ప్రశ్నించారు. అయితే కష్టాల్లో ఉన్న ప్రజలకు చేయూత నిచ్చేది పోయి ఆర్జేడి నేతలు సభకు జన సమీకరణలో బిజీగా ఉన్నారన బిజెపి సీనియర్ నేత ఎద్దేవా చేశారు. అలాగే ఆర్జేడి సభలో ప్రసంగించాలనుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సుశీల్ మోదీ కోరారు. ‘వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చే మీరు రాజకీయ సభలో మాట్లాడవచ్చా?’ అని రాహుల్‌ను ప్రశ్నించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 26న వరద పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తారని సుశీల్‌కుమార్ మోదీ వెల్లడించారు.