క్రీడాభూమి

హర్యానాపై యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రో కబడ్డీలో బుధవారం జరిగిన మ్యాచ్‌ని యు ముంబా గెల్చుకుంది. హర్యానా స్టీలర్స్‌పై ఆ జట్టు ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అనూప్ కుమార్ 8, కుల్దీప్ సింగ్ 7, శ్రీకాంత్ జాధవ్ 6 చొప్పున పాయింట్లతో రాణించడంతో యు ముంబా 38 పాయింట్లు సాధించగలిగింది. హర్యానా 32 పాయింట్లతో సరిపుచ్చుకుంది. వికాస్ కంకోలా 9, వజీర్ సింగ్ 7 పాయింట్లు చేసినప్పటికీ, తమ జట్టును ఆదుకోలేకపోయారు.
షర్జీల్‌పై సస్పెన్షన్ వేటు
కరాచీ: పాకిస్తాన్ టెస్టు బ్యాట్స్‌మన్ షర్జీల్ ఖాన్‌పై వేటు పడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) విచారణ చేపట్టింది. ఆటగాళ్లకు అవినీతి నిరోధక విభాగం నిర్దేశించిన ఐదు కీలక నిబంధనలను షర్జీల్ ఉల్లంఘించినట్టు రుజువుకావడంతో, అతనిపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది.
ఇలావుంటే, తనను సస్పెండ్ చేయడం అన్యాయమని షర్జీల్ ఒక ప్రకటనలో వాపోయాడు. తాను ఫిక్సింగ్‌కు పాల్పడలేదని మరోసారి చెప్పాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు.