క్రీడాభూమి

ఆసీస్‌పై బంగ్లా చారిత్రక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టెస్టుల్లో ఆసీస్‌పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. మొత్తం మీద 101 టెస్టుల్లో బంగ్లాదేశ్ 10వ విజయాన్ని సాధించింది. టెస్టు హోదాగల మిగతా తొమ్మిది దేశాల్లో ఇప్పటికే జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లను ఓడించిన ఘనతను దక్కించుకున్న బంగ్లా ఇప్పుడు ఆసీస్‌ను ఓడించి, ఆ జాబితాలో మరో పేరును చేర్చుకుంది. ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమేగాక, అర్ధ శతకాన్ని కూడా సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు పడగొట్టి, ఆసీస్‌ను దెబ్బతీశాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లో స్కోరింగ్ మ్యాచ్
ఈ టెస్టును లో స్కోరింగ్ మ్యాచ్‌గా పేర్కోవాలి. బౌలర్లకు, ప్రత్యేకించి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్లు భారీ స్కోర్లను సాధించలేకపోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (71), షకీబ్ అల్ హసన్ (84) అర్ధ శతకాలు చేశారు. ఆసీస్ బౌలర్లలో పాక్ కమిన్స్, నాథన్ లియాన్, ఆస్టన్ అగర్ తలా మూడేసి వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (45), లోయల్ ఆర్డర్‌లో అష్టన్ అగర్ (41) జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (78) మరోసారి హాఫ్ సెంచరీ సాధించగా, ముష్ఫికర్ రహీం (41) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ 82 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. అష్టన్ అగర్‌కు రెండు వికెట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో లోటుతో కలిపి, 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటై, 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. డేవిడ్ వార్నర్ 112 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, అతనికి మద్దతుగా ఎవరూ నిలవలేదు. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (37), పాట్ కమిన్స్ (33) కొంత వరకూ ఫరవాలేదని అనిపించారు. షకీబ్ అల్ హసన్ 85 పరుగులకు ఐదు వికెట్లు కూల్చగా, తమిమ్ ఇక్బాల్ 60 పరుగులిచ్చి మూడు, మెహదీ హసన్ 80 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 78.5 ఓవర్లలో 260 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 71, షకీబ్ అల్ హసన్ 84, పాట్ కమిన్స్ 3/63, 3/79, 3/46).
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 74.5 ఓవర్లలో 217 ఆలౌట్ (మాట్ రెన్షా 34, అష్టన్ అగర్ 41, షకీబ్ అల్ హసన్ 5/68, మెహదీ హసన్ 3/62).
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 79.3 ఓవర్లలో 221 ఆలౌట్ (తమీమ్ ఇక్బాల్ 78, ముష్ఫికర్ రహీం 41, నాథన్ లియాన్ 6/82, అష్టన్ అగర్ 2/55).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 70.5 ఓవర్లలో 224 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 112, స్టీవ్ స్మిత్ 37, పాట్ కమిన్స్ 33, షకీబ్ అల్ హసన్ 5/85, తమీమ్ ఇక్బాల్ 3/60, మెహదీ హసన్ 2/80).