క్రీడాభూమి

300 క్లబ్‌లో ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం శ్రీలంకతో జరిగే నాలుగో వనే్డలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాడు. కెరీర్‌లో అతనికి ఇది 300వ వనే్డ కావడం విశేషం. భారత్ తరపున ఇప్పటి వరకూ సచిన్ తెండూల్కర్ (463 మ్యాచ్‌లు), రాహుల్ ద్రవిడ్ (344 మ్యాచ్‌లు), మహమ్మద్ అజరుద్దీన్ (334 మ్యాచ్‌లు), సౌరవ్ గంగూలీ (311 మ్యాచ్‌లు) మాత్రమే ఇంత వరకూ మూడు వందల వనే్డల క్లబ్‌లో ఉన్నారు. వారి సరసన ధోనీకి కూడా చోటు దక్కుతుంది. ఇంత వరకూ 299 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన ధోనీ 72 పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, మొత్తం 9,608 పరుగులు సాధించాడు. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 183 (నాటౌట్). ధోనీ ఖాతాలో 10 సెంచరీలు, 65 అర్ధ శతకాలు ఉన్నాయి. 736 ఫోర్లు, 209 సిక్సర్లు బాదిన ధోనీ 278 క్యాచ్‌లు పట్టాడు. స్టంపింగ్స్ సెంచరీకి కేవలం ఒక స్టంపింగ్ దూరంలో ఉన్నాడు. కొంతకాలం ఫామ్‌లో లేని కారణంగా తీవ్ర విమర్శలకు గురైన ధోనీ గత రెండు వనే్డల్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. అత్యంత కీలక సమయాల్లో అతను 45, 67 చొప్పున పరుగులు చేసి సత్తా చాటాడు. 2019 వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు.
కౌంటీ క్రికెట్‌లో అశ్విన్ శుభారంభం
వర్సెస్టర్: ఇంగ్లీష్ కౌంటీల్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం అదిరింది. వర్సెస్టర్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను తన తొలి మ్యాచ్‌లో గ్లూసెస్టర్‌షైర్‌పై 94 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేగాక, 36 పరుగులు చేసి, తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ సిరీస్‌కు అశ్విన్ ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అతనికి సెలక్టర్లు అవకాశం కల్పిస్తే, స్వదేశానికి వచ్చేలోగా అతను నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రమే ఆడగలుగుతాడు.
ఇండియా బ్లూకు రైనా కెప్టెన్సీ
న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడే ఇండియా బ్లూ జట్టుకు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ సురేష్ రైనా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 7 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఆడడం ద్వారా, తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకొని, మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు రైనా ప్రయత్నించనున్నాడు. 2015 అక్టోబర్‌లో చివరి వనే్డలో ఆడిన అతనికి ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న టీమిండియాలో చోటు దక్కని విషయం తెలిసిందే. నాలుగు రోజుల మ్యాచ్‌లు కనీసం రెండింటిని ఆడనున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో అతనికి స్థానం లభించడం అసాధ్యంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన మురళీ విజయ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్‌తో, ఇండియా గ్రీన్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ జట్టుకు పార్థీవ్ పటేల్ నాయకత్వం వహిస్తాడు.
జట్ల వివరాలు
ఇండియా బ్లూ: సురేష్ రైనా (కెప్టెన్), సమిత్ గొహెల్, కెఎస్ భరత్, ఎఆర్ ఈశ్వరన్, మనోజ్ తివారీ, దీపక్ హూడా, విజయ్ శంకర్, ఇషాన్ కిషన్, జయంత్ యాదవ్, భార్గవ్ భట్, కెఎం గాంధీ, ఇశాంత్ శర్మ, అంకిత్ రాజ్‌పుత్, ఎస్. కామత్, జయదేవ్ ఉనాద్కత్.
ఇండియా గ్రీన్: పార్థీవ్ పటేల్ (కెప్టెన్), మురళీ విజయ్, ఆర్. సమర్థ్, ప్రవీణ్ చోప్రా, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్, అంకిత్ బనే్వ, షాబాజ్ నదీం, పర్వేజ్ రసూల్, నవ్‌దీప్ సైనీ, మహమ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, మాయాంక్ డగర్, నితిన్ సైనీ, అనికేత్ చౌదరి.