క్రీడాభూమి

వచ్చేసారి సింధు స్వర్ణం సాధించాలి: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని తెలుగు తేజం పివి సింధును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ నవోమీ ఒకుహరా చేతిలో పరాజయాన్ని చవిచూసిన సింధు రజత పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ప్రగతి భవన్‌లో కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. సింధు, గోపీచంద్‌ను శాలువాలు కప్పి కెసిఆర్ సన్మానించారు. జ్ఞాపికలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సింధు టైటిల్ సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. చివరిలో తడబడినప్పటికీ, ఆమె అద్భుత పోరాట పటిమను కనబరచిందని ప్రశంసించారు. ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అంటూ ఆమెను ప్రోత్సహించారు. సింధుకు ఐటి శాఖ మంత్రి కె. తారకరామా రావు చేనేత చీరలను బహూకరించారు. సింధు సాధిస్తున్న విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు.
చిత్రం.. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన పివి సింధు, కోచ్ గోపీచంద్‌ను ప్రగతి భవన్‌లో బుధవారం సత్కరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.