ఖమ్మం

ఎన్నికల నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సింగరేణి కాలరీస్ డైరక్టర్ (పా) పవిత్రన్ కుమార్ కోరారు. శనివారం రాత్రి సింగరేణి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 5న నిర్వహించే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌ల సేకరణ, ఓటర్ల జాబితా, పోలింగ్ అధికారుల ఎంపిక కోసం పోలీసులు, రెవెన్యూ, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను ఈ నెల 18లోగా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితా తయారీలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పర్సనల్ ఆనందరావు, జిఎం రుష్యేంద్రుడు, ఎస్‌వో-2 డైరక్టర్ (పా) మురళీసాగర్ కుమార్, జిఎం పర్సనల్ అండ్ వెల్ఫేర్ అండ్ సిఎస్సార్ మసూద్ ముజాహిద్, జిఎం ఐటి గీతా మోహన్, డిజిఎం పర్సనల్ అనిల్ కుమార్, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాజమాన్యాల మెప్పుకోసమే కార్మికుల కడుపుకొడుతున్న ప్రభుత్వం
ఖమ్మం(కల్చరల్): రాష్టవ్య్రాప్తంగా ఉన్న 73 సంస్థల్లో పని చేస్తున్న 40 లక్షల మంది కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కాకుండా యాజమాన్యాల మెప్పుకోసం కార్మికుల కడుపు కొట్టడం ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు ఆరోపించారు. ఆదివారం స్ధానిక సుందరయ్యభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ధరలకు అనుగుంగా కనీస వేతనచట్టాన్ని సవరించాల్సి ఉన్నా గత 11 ఏళ్ళుగా ప్రభుత్వం ఎటువంటి సవరణలు చేయకపోవడంతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కార్మికులు మోయాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో వచ్చిన జీఓ నెంబర్ 54 ప్రకారం ఇప్పటికి రెండుసార్లు వేతనచట్టాని సవరించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవపం దారుణమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 46 జీఓలు, ఏర్పడ్డ తరువాత మరో 25 జీఓలకు కాలం చెల్లిందన్నారు. కొత్త జీఓలు తీసుకురాకపోగా కార్మికులకు ఉన్న దాదాపు 71 జీఓలు కాలగర్భంలో కలిసాయని ఆయన విచారరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగానికి, పార్లమెంట్‌కు, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. కార్మికుడికి తన కుటుంబ పోషణకు కావాల్సిన వేతనాన్ని పొందటానికి గతంలో అనేక రకాల పోరాటాలు, ఆందోళనలు నిర్వహించినప్పటికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. కార్మికులకు ఇప్పుడున్న జీఓలను ప్రభుత్వం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. ఈ జీఓలను అమలు చేస్తే కేవలం ఆయా యాజమాన్యాలే చెల్లిస్తాయని ప్రభుత్వానికి తెలిసికూడా కార్మికుల పట్ల మొండిగా వ్యవహరించడం తగదన్నారు. కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పార్టీలకు, సంఘాలకు అతీతంగా పాల్గొని రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయేలా కార్మికసోదరులు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికై లక్షలాది కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, జీపుజాతాల ద్వారా ప్రతి కార్మికుడ్ని స్వయంగా కలవనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె నర్సింహారావు, కల్యాణం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్, జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, లింగయ్య పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన హమాలీ రాష్ట్ర మహాసభలు
* ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
* 83 మందితో నూతన కమిటి ఎన్నిక
ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 10: తెలంగాణ ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధమ మహాసభలు మల్లెంపూడి నాగేశ్వరరావు నగర్, మంచికంటి భవన్ ఖమ్మంలో ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి. ముందుగా హమాలీ యూనియన్ సీనియర్ నాయకుడు మద్ది సత్యం జెండావిష్కరించారు. నాయకులు, ప్రతినిధులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన ప్రతినిధుల సభలో31 జిల్లాలకు చెందిన 400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ బేవరేజస్, సివిల్ సప్లైయ్, మార్కెటింగ్, రైల్వే తదితర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దశాబ్ధాలుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురౌతున్న హమాలీలను ప్రభుత్వాలను కదిలించేలాగా సమరశీల పోరాటాలకు సిద్దంకావాలని వారు పిలుపునిచ్చారు. తమ శ్రమతో ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న హమాలీలకు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు అడిగే హక్కులేదా అని ప్రశ్నించారు. హమాలీలు పడుతున్న శ్రమ ప్రభుత్వాలకు కనిపించడంలేదా అని నిలదీశారు. వెల్ఫేర్ బోర్డు, ఇఎస్‌ఐ, పెన్షన్ కోసం అక్టోబర్ నెలలో జరిగే పోరాటాలకు పెద్ద ఎత్తున సిద్దంకావాలని పిలుపునిచ్చారు. అనంతరం 83 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా తుమ్మల వీరారెడ్డి(నల్లగొండ), పాలడుగు సుధాకర్ (హైదరాబాద్), కోశాధికారిగా శ్రీరాములు, ఉపాధ్యక్షులుగా పాలడుగు భాస్కర్, మరో 19 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాదిరెడ్డి అంజిరెడ్డి, భూక్యా శ్రీనులు రాష్ట్ర ఉపాధ్యక్ష స్ధానం వరించింది.

ఐలమ్మ జీవితం ఆదర్శం
* ఎమ్మెల్యే పువ్వాడ
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆనాటి రజాకార్లపై పోరాడిందని, ఆమె జీవితం ఆదర్శప్రాయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్థంతిని పురస్కరించుకొని స్థానిక ధర్నాచౌక్ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రజకసంఘం ఆధ్వర్యంలో స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వర్థంతి సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమికోసం, భుక్తి, తెలంగాణ రైతాంగ విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు ముందుకు రావాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ సాగించిన పోరాటం మరువలేనిదని, నైజాం నవాబును ఎదిరించి పోరాడిన చరిత్ర ఐలమ్మకు ఉందన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పథకంలో నీళ్ళు పారాలంటే సముద్రాన్ని తోడాలి
* మేధావుల సంఘం జిల్లాచైర్మన్ బివి రాఘవులు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు దాటినా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అసమర్ధపాలన సాగిస్తోందని మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసి నీళ్ళు అందిస్తామని చెబుతున్న ఈప్రభుత్వం నల్లాలోకి నీళ్ళు రావాలంటే సముద్రాన్ని తోడాలని మేధావుల సంఘం జిల్లా చైర్మన్ బివి రాఘవులు విమర్శించారు. మీనవోలు గ్రామంలో ఆదివారం జరిగిన టిమాస్ మండల మహాసభ సగ్గుర్తి సంజీవరావు, గద్దల సంగయ్యల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ భారతదేశంలో 6747కులాల వ్యవస్థ రాజ్యమేలుతోందని, ఏ దేశంలో లేని కులాలు భారతదేశంలో ఉన్నాయన్నారు. భారతదేశాన్ని ఆక్రమించిన బ్రీటిష్ వారు మనభారత ప్రజల్ని బానిసలుగా మార్చి కుల వ్యవస్థను సృష్టించి కులాల మధ్య చిచ్చులు పెట్టి వారిపబ్బం గడుపుకున్నారన్నారు. వృత్తుల పరంగా కులాలను విభజించారన్నారు. కుల వ్యవస్థను రూపుమాపాలన్నదే టిమాస్ లక్ష్యమని తెలిపారు. టిమాస్ నినాదం కులవ్యవస్థను చంపండి-పనికి తగ్గ్ఫలితాన్ని అశించండి-దోపిడిని అరికట్టండని పిలుపునిచ్చారు. డబుల్‌బెడ్‌రూం అర్హతకు 22లక్షల మందిని తెల్చారని, 9లక్షల మందికి 3ఎకరాల భూమి పంచితే 27లక్షల ఎకరాల భూమి కావాలని, తెలంగాణ అంతా కలిపితేనే అంత భూమిలేదని, కెసిఆర్ చెప్పేవన్ని భూటకపు మాటలేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం ఉపేంద్ర, డి వీరయ్య, ఉషాకిరణ్, రాములు, వెంకట్రామయ్య, నాగేశ్వరరావు, ప్రభాకర్, శ్రీను పాల్గొన్నారు. టిమాస్ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కొండూరు నాగేశ్వరరావు, ఈసం శ్రీనుతోపాటుగా 23 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాజకీయాలకు అతీతంగా సమితుల సేవలందించాలి
* స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్
కొణిజర్ల, సెప్టెంబర్ 10: ఆత్మహత్యలు చేసుకునే వారిగా కాకుండా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి రైతులు ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ రైతు సమన్వయ సమితి సభ్యులను కోరారు. మండల పరిధిలోని శాంతినగర్ సమీపంలో గల ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన గ్రామ, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సమావేశం స్థానిక ఏడిఏ శోభన్‌బాబు అధ్యక్షతన జరిగింది. తొలుత సమన్వయ సమితి సభ్యుల చేత ఎమ్మెల్యే చిత్తశుద్ధితో, కుల, మత, రాజకీయాలకు అతీతంగా రైతులకు సేవలందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించటమే రైతు సమన్వయ సమితుల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వ్యవసాయంలో 80 శాతం మహిళల పాత్ర ఉందని అందుకే సమితుల ఏర్పాటులో మూడవ వంతు మహిళా రైతులకు ముఖ్యమంత్రి కేటాయించటం జరిగందన్నారు. పారిశ్రామిక వేత్తలకు తమ వస్తువులకు ఎమ్మార్పీ ధర నిర్ణయించి అమ్ముకునే అవకాశం ఉందని, రాత్రి, పగలు కష్టపడి పంటపండించే రైతులు మాత్రం తమ పంటలను బ్రతిమాలి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పంటలకు గిట్ట్ధుర కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15 డిసెంబర్ 15 వరకు జరగనున్న సమగ్ర భూ సర్వేని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పరిపాలనను క్షేత్థ్రుయికి తీసుకెళ్ళిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. మండల రైతు సమన్వయ సమితి సమన్వయ కర్తగా నియమిలైన మల్లుపల్లి గ్రామానికి చెందిన దొడ్డపనేని రామారావుని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. జిల్లా వ్యవసాయాధికారి ఝాన్సీలక్ష్మి కుమారి, వ్యవసాయ శాఖ కమీషనరేట్ డిడిఏ మోహన్‌రెడ్డి, డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసరావు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాణోత్ నరసింహారావు, జడ్పీటిసి సోమ్లా , ఏడిఏలు శ్రీనివాసరెడ్డి, సరిత, సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు పి వెంకటేశ్వర్లు, సునిత, బి బాబు, వైరా ఏన్కూరు వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
మత్స్య కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అదుకుంటుంది
నేలకొండపల్లి, సెప్టెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని నేలకొండపల్లి ఎంపిపి నందిగామ కవితరాణి వెల్లడించారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని చెర్వుమాదారం గ్రామంలోని చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ఐదువేల చేప పిల్లలను ఎంపిపి చెరువులో వదిలే కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులకు ఉచితంగా చేప పిల్లలను అందించి వారిని ఆదుకుంటుందన్నారు. మత్స్య కార్మికులను సొసైటీలుగా ఏర్పాటు చేసి వారిని ఆర్ధికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. చేప పిల్లలను ఏ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదని టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోగినేని అచ్చమ్మ, మత్స్యశాఖ అధికారి వరదరెడ్డి, మత్స్య శాఖ జిల్లా అధ్యక్షుడు యడవల్లి చంద్రయ్య, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొండలు, వెంకటరమణ, బాలు, కృష్ణారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జిఓ 39ను రద్దుచేయాలి
ఏన్కూరు, సెప్టెంబర్ 10: జివో నంబరు 39ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేదగిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ రైతు కమిటీల వలన ఒరిగేదేమీ లేదన్నారు. రైతు సమన్వయ కమిటీల్లో టిఆర్‌ఎస్ నాయకులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హాయాంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేశారని, ఆపార్టీకి పట్టిన పరిస్థితి టిఆర్‌ఎస్‌కు వస్తుందన్నారు. టిఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు త్వరలో ప్రజలే బుద్ది చెపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బాలాజీ, రాములు, నాగేశ్వరరావు, కిషన్‌రావు, సంజీవరావు, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.