జాతీయ వార్తలు

ఎన్‌యుఎల్‌ఎమ్‌పై ఆడిట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: జాతీయ పట్టణ పేదల ఆవాస పథకం (ఎన్‌యుఎల్‌ఎమ్) కింద కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిధులపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తక్షణం ఆడిట్ నిర్వహించాలని, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌కు ఆ బాధ్యత అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సుప్రీం సూచించింది. ఒక ప్రత్యేక సదుపాయంకోసం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పడుతోన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇది మంచిది కాదని అత్యన్నత న్యాయ స్థానం అభిప్రాయపడింది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కైలాశ్ గంభీర్ ఆధ్వర్యాన కమిటీ ఏర్పాటు చేసి ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూనే, దీనిపై మీనమేషాలు లెక్కించడం ఎంతమాత్రం మంచిది కాదని కోర్టు సూచించింది. జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రాల వద్ద 412 కోట్లు వినియోగించకుండా ఉండిపోయాయని, ఇవికాకుండా 2017-18 ఖాతాకింద కేంద్రం 228 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు.
‘రాష్ట్రాల వద్ద నిధులు మురిగిపోతున్నా, మీరు నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలను ఎందుకు గట్టిగా ప్రశ్నించరు. రాష్ట్రాలు నిధులు వినియోగించలేనపుడు కేంద్రం విడుదల చేయాలి’ అని కోర్టు ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ వివరణ ఇస్తూ, ఈ పథకం కింద 60శాతం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే, రాష్ట్రాలు మిగిలిన 40శాతం భరించాల్సి ఉందని వివరించారు. అదే జమ్మూ కాశ్మీర్‌లాంటి రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం నిధులు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. దీనిపై ధర్యాసనం జోక్యం చేసుకుంటూ ‘ఆడిట్ అనివార్యం. సాధ్యమైనంత వరకు కాగ్‌తో ఆడిట్ నిర్వహించటం మంచిది’ అని ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.