హైదరాబాద్

కాస్త ముందుగానే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: దేశవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల మధ్య జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 పోటీలకు జిహెచ్‌ఎంసి ఈ సారి కాస్త ముందుగానే సన్నాహాలు చేస్తోంది. ఇందుకు కోసం అధికారులు అనుసరించాల్సిన తీరుపై ప్రత్యేకంగా ప్రణాళికలను కూడా సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సార్లు సమావేశాలు నిర్వహించిన కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లతో విస్త్రృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 మొత్తం వివిధ విభాగాల్లో 4వేల మార్కులను కేటాయించనున్నట్లు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. అయితే 2018 సర్వేక్షణ్‌కు చేపట్టిన ప్రామాణిక మార్గదర్శకాల్లో అత్యధికంగా జిహెచ్‌ఎంసి చేపట్టిన వినూత్న కార్యక్రమాలున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ సర్వేలో ప్రజాభిప్రాయ సేకరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన దృష్ట్యా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రవేశపెట్టిన స్వచ్ఛత మొబైల్ యాప్‌ను దాదాపు 2లక్షల మందిచే డౌన్‌లోడ్ చేయించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సారి సర్వేలో కేటాయించిన 4వేల మార్కుల్లో ప్రధానంగా స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల ఫీడ్‌బ్యాక్‌కు అత్యధికంగా అంటే 1600 మార్కులు, నగరంలో చేపట్టిన పలు స్వచ్ఛ కార్యక్రమాలు, వాటి ప్రభావంపై అందజేసే నివేదికలకు 35 శాతం అంటే 1400 స్వచ్ఛ భారత్ మిషన్ సర్వే బృందం నేరుగా చేపట్టే క్షేత్ర స్థాయి తనిఖీల్లో పరిశీలనలకు 25 శాతం అంటే వెయ్యి మార్కులున్నాయని వివరించారు. కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సమర్పించిన డాక్యుమెంట్లకు, క్షేత్ర స్థాయి పరిశీలనలో తేడా ఉంటే నెగిటీవ్ మార్కులను కూడా ప్రవేశపెట్టడం ఈ సారి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు జయరాజ్ కెనడీ, శంకరయ్య, రవికిరణ్, భాస్కరాచారి, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జిహెచ్‌ఎంసికి అగ్ర స్థానంలో నిలిపే దిశగా స్వచ్ఛ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత సంవత్సరం అమలు చేసిన పలు వినూత్న కార్యక్రమాల్లో ప్రధానంగా ఓపెన్ గ్యార్బెజ్ పాయింట్ల ఎత్తివేత, రెండు డస్ట్‌బిన్ల పంపిణీ విధానం, స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను వేర్వేరుగా సేకరించటం, దోమల నివారణపై చైతన్యం తదితర కార్యక్రమాలు ఉన్నాయని కమిషనర్ స్పష్టం చేశారు.