జాతీయ వార్తలు

పిల్లలే అక్షర భారత్ సారథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, సెప్టెంబర్ 15: రానున్న ఐదేళ్ల కాలంలో దేశంలో నూరుశాతం అక్షరాస్యత సాధించాలంటే పిల్లలదే కీలక భూమిక అని కేంద్ర జన శక్తివనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. అన్ని రాష్ట్రాల సహకారంతో 2022కల్లా నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఈ బృహత్తర లక్ష్యం సాకారం కావాలంటే పిల్లలందరూ అక్షరాస్యులు కావాల్సిందేనని, వారు చదువుకోవడానికి అన్ని విధాలుగా అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిందేనని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో దేశంలో అక్షరాస్యత కేవలం 18శాతమేనని, 70ఏళ్ల తర్వాత 81శాతానికి చేరుకోగలిగామని శుక్రవారం ఇక్కడ జరిగిన అక్షర్ సమ్మాన్ సమ్మోహ్ కార్యక్రమంలో తెలిపారు. నిజానికి మొదటి పాతికేళ్ల కాలంలోనే వంద శాతం అక్షరాస్యతను సాధించి ఉండాల్సిందని పేర్కొన్న జవడేకర్ కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు మోదీ సర్కార్ దీన్నో సవాలుగా తీసుకుని 2022 కల్లా పూర్తిస్థాయి అక్షరాస్యతను సాధించాలన్న పట్టుదలతో పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ అక్షరాస్యత పథకంతో పాటు పిల్లలు కూడా ఈ విషయంలో క్రియాశీలకంగా పని చేసి అంతమ లక్ష్య సాధనకు దోహదం చేయాలన్నారు. బాలలే ఈ లక్ష్యాన్ని భుజానకెత్తుకుని అక్షరాస్యతా వ్యాప్తిలో క్రియాశీలక భూమిక పోషించాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ పిల్లలందరూ బడికి వెళుతున్నారని పేర్కొన్న ఆయన ‘పిల్లలు స్కూళ్లలో చేరడం అన్నది 98శాతానికి చేరుకుంది. పిల్లల చదువుకోవడం వల్ల వారు తమ తల్లిదండ్రులకూ కుటుంబంలోని ఇతర పెద్దలకూ విజ్ఞానాన్ని అందించగలుగుతారు. ఆ విధంగా తమ వయసులో చదువుకోలేని వారు సైతం అక్షర జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది’ అని అన్నారు.

చిత్రం..చత్తీస్‌గఢ్‌లో అక్షర్ సమ్మాన్ సమ్మోహ్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందుతున్న మహిళల కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి జవడేకర్, ముఖ్యమంత్రి రామన్‌సింగ్