ఖమ్మం

భద్రాద్రిలో దసరా శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 19: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 21(రేపటి) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు లక్ష్మీతాయారు అమ్మవారికి అలంకరాలు నిర్వహించునన్నారు. 30వ తేదీన విజయదశమి సందర్భంగా శ్రీరామాయణ హవన పూర్ణాహుతి, మహా పట్ట్భాషేకం, ఆయుధపూజ, శమీపూజ, విజయోత్సవం నిర్వహిస్తారు. అలాగే శ్రీరామలీలా మహోత్సవాన్ని దసరా మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయం ఎదుట ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి అందులో శ్రీ సీతారామచంద్రస్వామిని రజత సింహాసనంపై ఆశీనులను చేసి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని దశాబ్ధాలుగా ఇదే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుండగా తొలిసారిగా పొన్నవాహనంలో రజత సింహాసనంపై భద్రాద్రి రామయ్య లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. సంప్రదాయబద్ధంగా ఈ మార్పును చేపట్టినట్లు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీన ఆదిలక్ష్మీ అలంకారం, 22న సంతాన లక్ష్మీ, 23న గజలక్ష్మీ, 24న ధనలక్ష్మీ అలంకారం ఉంటాయని, 25న ధాన్యలక్ష్మీ, 26న విజయలక్ష్మీ, 27న ఐశ్వర్యలక్ష్మీ, 28న వీరలక్ష్మీ, 29న మహాలక్ష్మీ, 30వ తేదీన నిజరూపలక్ష్మీ అలంకారాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.

మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు

ఖమ్మం, సెప్టెంబర్ 19: మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఖమ్మం జిల్లాలో 83, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణకు గడువు మంగళవారంతో ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి సమయానికి కూడా ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలలో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికి ఖమ్మంలో దరఖాస్తులు రెండువేలు దాటగా కొత్తగూడెంలో 1200దరఖాస్తులు దాటాయి. రెండేళ్ళ కాలపరిమితితో లైసెన్సులు వచ్చే అవకాశం ఉండటం, ఈ రెండేళ్ళలోనే సహకార, స్థానిక, సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో దరఖాస్తు రుసుం లక్ష రూపాయలు అయినప్పటికీ వెనుకాడకుండా దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది కంటే దరఖాస్తు రుసుం రెట్టింపయినప్పటికీ వ్యాపారులు వెనుకంజ వేయడంలేదు. ఈ ఏడాది మద్యం వ్యాపార రూపేణ వెయ్యికోట్లకు పైగా ఆదాయం ఖమ్మం జిల్లా నుంచే వస్తుందని అంచనా వేస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఐదులక్షల రూపాయల డిడిని కూడా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా గత కొనే్నళ్ళుగా మద్యం వ్యాపారంలో ఉన్నవారు ముందస్తుగానే సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తులు చేస్తున్నారు. గత రెండు మూడురోజులుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఎవరికి దుకాణం వచ్చినా అందరం కలిసి నడపాలనే అంగీకారానికి వసుతన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో గత కొంతకాలంగా మద్యం వ్యాపారంలో ఉన్నవారు సిండికేట్‌గా ఏర్పడినట్లు బాహటంగానే తెలుస్తోంది. మరోవైపు గతంలో మాదిరిగా బ్లాక్ మనీని తీసి వ్యాపారంలోకి పెట్టడానికి అవకాశం లేకపోయినా అన్ని లావాదేవిలు ఆన్‌లైన్ ద్వారా జరిపేందుకు కూడా వ్యాపారులు వెనుకంజ వేయడంలేదు. మద్యం దుకాణాలు కొనే్నళ్ళుగా నిర్వహిస్తున్న వారే ఈ ఏడాది కూడా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వీరికి కొందరు ఎక్సైజ్ అధికారులు మద్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం.