జాతీయ వార్తలు

నవంబర్‌లో ఎఐసిసి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పట్టం కట్టేందుకు నవంబర్‌లో ఏఐసిసి సమావేశం కానున్నది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత కూడా సోనియా గాంధీ రాజకీయాల్లో కొనసాగుతారు, ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. దీనితోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలాఖరుకల్లా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి నవంబర్‌లో జరిగే ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేందుకు పెద్దఎత్తున ఎర్పాట్లు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ తన వర్గానికి చెందిన కొందరు ఎంపిక చేసి వివిధ పదవుల్లో ఎవరెవరు ఉండాలి, వర్కింగ్ కమిటీలో ఎవరెవరికి స్థానం కల్పించాలనేది ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తం సభ్యుల సంఖ్య 21, ఇందులో పది మందిని ఏఐసిసి సమావేశంలో ఎన్నుకుంటారు. మిగతా పదకొండు మందిని కాంగ్రెస్ అధ్యక్షుడు నామినేట్ చేస్తారనేది తెలిసిందే. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తన వర్గంవారికి పెద్దపీట వేయనున్నట్లు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అయితే సీనియర్ నాయకులందరిని ఒకేసారి తొలగిస్తే పార్టీ నిలదొక్కుకోలేదని భావిస్తున్న సోనియా గాంధీ, దాదాపు ముప్పై శాతం పదవులను సీనియర్ నాయకులకు రిజర్వు చేసినట్లు తెలిసింది. సోనియా తీసుకున్న నిర్ణయానికి రాహుల్ కూడా అంగీకారం తెలియజేశారని అంటున్నారు. దీనితో రాహుల్ గాంధీ వర్గం, సీనియర్ నాయకుల మధ్య ఇంతకాలం కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధానికి తెరపడిందని అంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.రామచంద్రన్ నాయకత్వంలోని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కమిషన్ అక్టోబర్ మూడో తేదీనాడు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల షెడ్యూలును సిద్ధం చేయనున్నది. ఈ షెడ్యూలులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీకూడా ఉంటుంది. షెడ్యూలును ఖరారు చేయగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై సంస్థాగత ఎన్నికల షెడ్యూలుకు ఆమోదముద్ర వేస్తుంది. అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం తేదీలను కూడా ఖరారు చేస్తుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తుది గడువు మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అంటే సభ్యత్వ నమోదు, మండల, జిల్లా, రాష్టస్థాయి ఎన్నికలు, పిసిసి డెలిగేట్లు, ఏఐసిసి డెలిగేట్లు, కొత్త అధ్యక్షుడి ఎన్నిక, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం తదితర అంశాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయవలసి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేసి ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించవలసి ఉంటుంది. అందుకే పార్టీ అధినాయకత్వం నవంబర్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సు నిర్వహించటం ద్వారా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించాలనుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో దాదాపు 18ఏళ్ల కొనసాగినా సోనియా గాంధీ నవంబర్ నుండి రాహుల్ గాంధీ వర్గం, సీనియర్ నాయకుల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ వెంటనే పార్టీ రాజకీయాలకు దూరమైతే సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తారని వారంటున్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌పై పూర్తిపట్టు వచ్చేంతవరకు సోనియా గాంధీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలిగా ఉండవలసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.