క్రీడాభూమి

సమర్థుడు మటోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: అండర్-17 సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి పోటీపడుతున్న భారత జట్టుపై చాలా మందికి గొప్ప అంచనాలేవీ లేవు. అయితే, పోర్చుగీస్ మాజీ ఫుట్‌బాలర్ లూయిస్ నార్టన్ డి మటోస్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కారణంగా, భారత జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తుందని, ఈ మెగా టోర్నీలో తన ఉనికిని చాటుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ తక్కువేనన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడను ప్రొఫెషన్‌గా ఎంచుకున్న ఎంతో మంది తాము పొరపాటు నిర్ణయం తీసుకున్నామని వాపోయే పరిస్థితి. ఆటగాడిగా ఎదగడానికి సరైన ప్రోత్సాహం ఉండదు. వౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండవు. అవాంతరాలు అధిగమించి, కష్టాలకు ఎదురొడ్డి ఒకవేళ ఉన్నత ప్రమాణాలను అందుకున్నా గుర్తింపు ఉండదు. ఐ లీగ్ టోర్నమెంట్ రాకతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. శుక్రవారం నుంచి మొదలయ్యే అండర్-17 వరల్డ్ కప్‌తో యువత ఫుట్‌బాల్ వైపు మొగ్గు చూపుతారని ఫుట్‌బాల్ అధికారులు ఆశిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు సంచలన విజయాలను నమోదు చేయగలిగితే, ఫుట్‌బాల్‌కు దేశంలో మంచి రోజులు వస్తాయని అటు అధికారులు, ఇటు అభిమానులు ఆశిస్తున్నారు. అండర్-17 వరల్డ్ కప్‌లో భారత్‌పై క్రమంగా అంచనాలు పెరగడానికి మటోస్ కోచ్‌గా ఉండడమే ప్రధాన కారణం. అందరూ అతనిపై అంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. 64 ఏళ్ల మటోస్‌కు ఫుట్‌బాల్‌లో అపారమైన అనుభవం ఉంది. 1971-72 సీజన్‌లో పోర్చుగల్ జాతీయ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న బెనిఫికా జూనియర్ జట్టులో అతను సభ్యుడు. ఆతర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌లో ఎనిమిది జట్లు, ఎస్‌ఎల్ ఫెనిఫికా, అకాడెమికా, ఎస్టోరిల్ ప్రాయా, అట్లెటికో సిపి, బెలెనెనె్సస్, స్టాండర్డ్ లిగే, పోర్టిమోనెన్స్, ఈస్ట్రెలా డి అమాడొరా తరఫున ఆడాడు. స్టాండర్డ్ లిగేలో ఆడినప్పుడు, ఒంటి చేత్తో ఆ జట్టును బెల్జియన్ కప్ టోర్నమెంట్‌లోవ రన్నరప్‌గా నిలబెట్టాడు. 1982లో జర్మనీతో జరిగిన ఒక స్నేహపూర్వక మ్యాచ్‌లో పోర్చుగల్ 1-3 తేడాతో ఓడింది. ఆ జట్టుకు ఏకైక గోల్‌ను మటోస్ అందించాడు. 1986-87 సీజన్‌లో, ఈస్ట్రెలా డి అమాడొరా తరఫున ఆడాడు. ఆ సీజన్‌తోనే కన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.
మటోస్ పూర్వీకులు భారతీయులు కావడం గమనార్హం. అతని ముత్తాత జన్మస్థలం గోవా. కాలక్రమంలో ఆ కుటుంబం పోర్చుగల్‌లో స్థిరపడింది. అక్కడ ఉన్నత స్థితికి చేరింది. ఆ దేశంలోని చాలా ప్రాంతాలకు అతని కుటుంబీకులైన నార్డన్ డి మటోస్, బైరో నోర్టన్ డి మటోస్ అనే పేర్లు ఉన్నాయి. 1989లో సెకండ్ డివిజన్ క్లబ్ అట్లెటికోకు మొట్టమొదటిసారి అతను కోచ్‌గా బాధ్యతడలు స్వీకరించాడు. కోచింగ్‌లోనూ అనుభవం సంపాదించిన అతనికి 2005లో పోర్చుగల్ టాప్ క్లబ్ విక్టోరియా డి సెటుబల్‌కు చీఫ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. 1990 దశకం చివరిలో అతను స్పోర్టింగ్ లిస్బన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. పశ్చిమ ఆఫ్రికాలోని గునియా బిసావో జాతీయ కోచ్‌గా అతను 2010లో ఎంపికయ్యాడు. అతను మార్గదర్శకంలోనే రెనాటో సాంచెస్, కొన్కాలొ గుడెస్, బెర్నాండో సిల్వ, విక్టర్ లిండెలఫ్ వంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగారు. మటోస్‌కు ఉన్న ఈ అనుభవమే భారత అండర్-17 జట్టుకు వరమని విశే్లషకులు అంటున్నారు. అతని శిక్షణలో రాటుదేలుతున్న భారత జట్టు రాబోయే మెగా టోర్నీలో తన ఉనికిని చాటుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో అమెరికాను ఎదుర్కొంటుంది. ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడి యడంలో ఈనెల ఆరున మ్యాచ్ జరుగుతుంది. అదే రోజు ఘనాను కొలంబియా, టర్కీని న్యూజిలాండ్, మాలిని పరాగ్వే జట్లు ఢీ కొంటాయ. భారత్‌కు అండర్-17 వరల్డ్ కప్‌లో ఆడ డం ఇదే మొదటిసారి. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న కార ణంగా జట్టుకు మెయన్ డ్రాలో నేరుగా స్థానం లభించింది. మిగతా జట్లు క్వాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించి, మెయన్ డ్రాకు అర్హత సంపాదించాయ.