ఖమ్మం

విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, అక్టోబర్ 17: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని కొత్తగూడెం ఆర్డీవో రవీంద్రనాధ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దారు కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో విలేఖరులతో మాట్లాడారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రెవిన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 66 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిందన్నారు. గ్రామసభల ద్వారా రైతుల భూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ నెలాఖరునాటికి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కోరారు. ఈ సమావేశంలో తహశీల్దారు జక్కని స్వర్ణ ఉన్నారు.
అభివృద్ధి సంక్షేమంలో దేశానికే తలమానికం
* స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్
కొణిజర్ల, అక్టోబర్ 17: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమంలో తిరుగులేని విధంగా తెలంగాణ ముందుకు దూసుకుపోతుంది. కెజి నుంచి పిజి వరకు ఉచిత అందించటంతోపాటు సన్నబియ్యంతో భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందచేయటం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధికింద వైద్యఖర్చులు అందించటం జరిగిందన్నారు. గత నెలలో 81 మందికి 50 లక్షల విలువైన చెక్కులను అందించామని, ప్రస్తుతం 107 మంది లబ్ధిదారులకు 87.95 లక్షలు అందించినట్లు తెలిపారు. సర్పంచ్ మేడా లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌లు పుల్లయ్య, నర్సయ్య, రవి, ఎంపిపి వి ఉమారాణి, జడ్పీటీసి సోమ్లానాయక్, తహశీల్దార్ శైలజ, ఎంపిడిఓ పి శ్రీనివాసరావు, ఆత్మ చైర్మన్ బాబు, ఆర్‌ఐ కొండలరావు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.