ఖమ్మం

ఘనంగా దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 19: చెడుపై సాధించిన మంచికి గుర్తుగా దేశవ్యాప్తంగా జరుపుకునే దీపావళి వేడుకను గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిల్లిపాది తలస్నానమాచరించి ఇంటిచుట్టూ మామిడితోరణాలు, చిన్న చిన్న విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఇంటివద్ద లక్ష్మీదేవికి పూజలు ముగించుకొని, సమీపంలోని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పిండివంటలను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించారు. ఉదయానే్న పిల్లలు, యువకులు తమ తమ స్నేహితులను వెంటతీసుకెళ్ళి దీపావళి మందులను కొనుగోలు చేసి, వాటిని కాస్తంత ఎండలో ఉంచారు. సాయంత్రం 5 గంటల నుండి ఇంటిచుట్టూ మట్టి ప్రమిదలను ఏర్పాటుచేసి చక్కటి ఆకారంలో వత్తులువేసి వెలిగించారు. ఇంట్లో ఆడపిల్లలు నూతన వస్త్రాలు ధరించి, అందంగా అలంకరించుకుని దీపాల ముందు ఫొటోలు దిగి స్నేహితులకు, బంధువులకు వాట్సప్, మెసెంజర్, ఫేస్‌బుక్‌ల ద్వారా పంపించి ఆనందం పంచుకున్నారు. ఇక పిల్లలు, యువతీ, యువకులు ఎప్పుడు చీకటి పడుతుందా టపాసులు కాల్చాలని ఎదురుచూశారు. సాయంత్రం 6గంటల నుండి పోటీలు పడి రాకెట్‌లు, చిచ్చుబుడ్లు, మతాబులు, షాట్‌లు, తవ్‌జండ్‌వాలాలు, ఆటంబాంబులు, లక్ష్మీబాంబులను యువకులు కాల్చగా, యువతులు, చిన్న పిల్లలు, వృద్దులు మాత్రం చప్పుడుకాని తాళ్ళు, కాకరపూలు, వెనె్నలమండుగులు వంటివాటిని కాల్చి ఆనందం వ్యక్తంచేశారు. పెద్దలు మనుమలు, మనుమరాండ్ల్రలను ఎత్తుకొని కాకరపూలు, తాళ్ళను కాలుస్తూ ఫోటోలు దిగారు. నగరంలో వాసవివనితాక్లబ్ ద్వారా మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. నగరంలో ఆకతాయిల హల్‌చెల్
దీపావళిని పుర్కరించుకొని ఆకతాయిలు మోటార్‌సైకిల్‌పై నగరంలో తిరుగుతూ హల్‌చల్ చేశారు. నలుగురు ఉన్నచోట ఈ ఆకతాయిలు బాంబులు కాల్చి వారిమధ్యన వేసి వేగంగా పారిపోవడంతో అనేక మంది పలురకాలుగా ఇబ్బందులు పడ్డారు. మరికొంత మంది వాహనచోదకులకు దగ్గరగా భారీ శబ్ధంతో కూడిన బాంబులను పేల్చి వారిని ఇంకో రకమైన ఇబ్బందులకు గురిచేసి పైశాచికానందాన్ని పొందారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది వాహనచోదకులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడ్డారు. ఇలాంటి ఆకతాయిలను కట్టడిచేయడంలో నగర పోలీసులు విఫలమైనారని ప్రజలు వాపోయారు. రానున్న పండుగల సందర్భంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.
ఏన్కూరులో...
ఏన్కూరు: మండలంలోని అన్ని గ్రామాలలో దీపావళి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా ఉదయానే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసారు. సాయంత్రం సమయంలోమహిళలు ఇండ్ల ముందు, భవనాలపైన దీపాలు వెలిగించి లక్ష్మీ పూజలు నిర్వహించారు. దీపాల వెలుగుల మద్య ఆనందోత్సవాలతో టపాసులు కాల్చి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. టిఎల్‌పేట గ్రామంలోని రామాలయాన్ని అయప్ప భక్తులు దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆలయం వద్దనే భక్తులంతా కలిసి టపాసులు కాల్చి దీపావళి వేడుకలు ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.