రాశిఫలం-11/18/2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ అమావాస్య మ.3.20
నక్షత్రం: 
విశాఖ సా.6.32.
వర్జ్యం: 
రా. 10.53 నుండి 12.37 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు
రాహు కాలం: 
ఉ9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడుతారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఒక అద్భుత అవకాశం వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. లాభం చేకూరుతుంది. ఆటంకాలున్నా సత్ఫలితాన్ని పొందుతారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు. ధనలాభముంటుంది. మనో ధైర్యాన్ని కలిగియుంటారు. విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ధననష్టాన్ని ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆకస్మిక భయంము ఆందోళన ఉంటుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తలువింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) అనారోగ్యబాధలతో సతమతమవుతారు. స్థానచలనమేర్పడుతుంది. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండవు. గృహంలో మార్పులు కోరుకుంటారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. అలసట ఉంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వార్తలు వింటారు. డబ్బు చేతికందుతుంది.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. వృథాప్రయాణాలెక్కువ చేస్తారు. వృత్తి ఉద్యోగరంగాల్లో సహనం వహించాలి.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అనారోగ్యబాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సమయస్ఫూర్తితో పనులు చేసుకోవాలి. నిరుత్సాహం కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులు మానుకోవాలి.
Date: 
Saturday, November 18, 2017
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి