జాతీయ వార్తలు

వజ్రతుల్యం అరుణాచల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, నవంబర్ 19: ఈశాన్య భారతం దేశానికి కిరీటం లాంటిదయితే అరుణాచల్ ప్రదేశ్ దానికి పొదిగిన వజ్రం లాంటిదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అభివర్ణించారు. నాలుగు రోజులపాటు ఈశాన్య భారత పర్యటనకు వచ్చిన రాష్టప్రతి వివేకానంద కేంద్ర 40వ వార్షికోత్సవంలో ఆదివారం ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. వివేకానంద కేంద్ర విద్యాలయాలు భారతదేశంలో సేవాభావాన్ని ఇనుమడింపజేస్తున్నాయని, అందుకు స్ఫూర్తిగా పనిచేస్తున్నాయని రాష్టప్రతి అన్నారు. రాష్ట్రంలో 36కు పైగా ఈ రకమైన కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆయన, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడంతోపాటు గిరిజన విద్యార్థులకు నాణ్యతాయుతమైన విద్యను కూడా అందిస్తున్నాయని తెలిపారు. ఈ సంస్థల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రస్తుతించిన ఆయన, వీరి విజయాలు రక్షణ దళాలు సాధించిన విజయాలతో సరిసమానమని అన్నారు. సాయుధ దళాల అధినేతగా త్రివిధ దళాల విన్యాసాలను చూసే అవకాశం తనకు కలుగుతుందని పేర్కొన్న కోవింద్ ‘ఈ సంస్థల విద్యార్థులు చేసిన విన్యాసాలు సాయుధ దళాల విన్యాసాలకు ఏమాత్రం తక్కువ కాదు’ అని తెలిపారు. రాష్ట్రంలో విస్మక్‌నగర్ సహా అనేక చారిత్రక ప్రాంతాలున్నాయని పేర్కొన్న ఆయన ‘ఈ విస్మక్‌నగర్‌లోనే శ్రీకృష్ణుడు రుక్మిణిని పరిణయమాడాడని పురాణాలు చెబుతున్నాయి’ అని అన్నారు. పురాణాల్లో కూడా అరుణాచల్ ప్రస్తావన ఉందని, దేశ చరిత్రలోనూ దీనికో నిరుపమాన స్థానం ఉన్నదని తెలిపారు. అందుకే ఈశాన్య భారతం భారత్‌కు కిరీటమైతే, అందులో పొదవిన నిరుపమాన వజ్రం అరుణ్‌చల్ అని పునరుద్ఘాటించారు. పచ్చని పైర్లు, మంచు ఆవృతమైన పర్వతాలు ఈ రాష్ట్రాన్ని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా మారుస్తున్నాయని అన్నారు. పర్యాటకులు ప్రపంచ నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఇక్కడున్న ప్రకృతి శోభిత సహజసిద్ధమైన వాతావరణమేనని కోవింద్ అన్నారు. అలాగే భిన్నత్వంలో ఏకత్వానికి కూడా అరుణాచల్ ప్రదేశ్ పెట్టని కోటలాంటిదని పేర్కొన్న ఆయన స్థానిక న్యాయ వ్యవస్థను, గ్రామాధిపతుల విధుల నిర్వహణను, కెబాంగ్ సంస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తుతించారు.

చిత్రం..అరుణాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన శాసనసభ భవనాన్ని ప్రారంభించి,
రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్