హైదరాబాద్

ఏకపక్షంగా తెలుగు మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తూ, తమకు నచ్చిన వారినే ప్రభుత్వం ఆహ్వానించిందని టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. శుక్రవారం నగర టీడీపీ ఆఫీసులో టీఎన్‌ఎస్‌ఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎం.ఎన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్న టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉందని తెలియజేశారు. ఈ విషయాన్ని గుర్తుచుకుని నేతలు, కార్యకర్తలు సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను ప్రభుత్వం మర్చిపోయి అవమానిందంటూ ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వానికి నచ్చిన వారి పేరిటే స్వాగత తోరణాలు, సాంస్కృతిక వేదికలను ఏర్పాటు చేశారని విమర్శించారు. తెలుగు భాషా గొప్పతనాన్ని, జాతీ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరిట కనీసం ఒక్క స్వాగత తోరణాన్ని గానీ, వేదికను గానీ ఏర్పాటు చేయకపోవటం దారుణమని అన్నారు.
నగరంలో ప్రతి వ్యాపార సంస్థ, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే ఏర్పాటు చేయాలంటూ, నిర్భందంగా తెలుగు భాషను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు భాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం గుర్తించిందన్నారు. అప్పట్లో రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ ఆదరణను ఆ తర్వాత చంద్రబాబు కొనసాగించారని, రాష్ట్రానికి బిల్ క్లింటన్, బిల్‌గేట్స్‌ను తీసుకురావటం ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సుకు సైతం టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన హైటెక్ సిటీయే వేదికైందంటే తెలుగు భాష, రాష్ట్భ్రావృద్ధికి ఆ పార్టీ చేసిన కృషిని అంచనా వేసుకోవచ్చునన్నారు. మరో నాలుగురోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సిఎం చంద్రబాబును కూడా ఆహ్వానించి, ఆయనకు మహాసభలో గౌరవప్రదమైన గుర్తింపునివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు వనం రమేష్, షకీలారెడ్డి, ముప్పిడి మధుకర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పగిళ్ల నర్సింగ్, లాలాజీ, ఉదయ్, జయసాయి, పవన్, సాయినాథ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.