అనంతపురం

గుత్తి మార్కెట్‌యార్డులో పేరుకుపోయిన వేరుశెనగ నిల్వలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, డిసెంబర్ 16 : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వేరుశెనగ నిల్వలు పేరుకుపోయాయి. బహిరంగ మార్కెట్‌లో వేరుశెనగ కాయల ధర పూర్తిగా తగ్గిపోవడంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం క్వింటాకు రూ.4,450 మద్దతు ప్రకటిస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే స్థానిక వ్యవసా య మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈనేపథ్యంలో బహిరంగ మార్కెట్, మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రానికి ధర సుమారు రూ.వెయ్యి వ్యత్యాసం ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున యార్డుకు వేరుశెనగ కాయలను తరలించారు. గుత్తి మార్కెట్‌యార్డు పరిధిలోకి గుత్తి, పామిడి, పెద్దవడుగూ రు మండలాలు వస్తాయి. దీంతో ఆ యా మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాయలను తీసుకొస్తుండటంతో 6 యంత్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. భారీస్థాయిలో వేరుశెనగ కాయలు రావడంతో మార్కెట్‌యార్డు పరిధిలోని రెండు ప్లాట్‌ఫారాలతోపాటు ఆరుబయట స్థలంలో విత్తనకాయలను నిల్వలు ఉంచి వరుస క్రమంలో టోకెన్ల వారిగా తుకాలు వేసి గోడౌన్లకు తరలిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు దాదాపు 10వేల క్వింటాళ్లకుపైగా కాయలను యార్డుకు తరలించారు. అయితే ఆయిల్‌ఫెడ్ అధికారులు సకాలంలో వేరుశెనగ కాయలను గోడౌన్లకు తరలించడానికి అవసరమైన స్థాయిలో లారీలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. లారీల కొరత కారణంగా ఇప్పటి వరకు కేవలం 3 వేల క్వింటాళ్లు మాత్రమే గోడౌన్లకు తరలించారు. మిగిలినవి యార్డు ఆవరణలోనే నిల్వ ఉన్నాయి. అధికారులు జారీ చేసిన టోకెన్ నంబర్ల ఆధారంగా తుకాలు వేసేంత వరకు రైతులు వారివారి వేరుశెనగ బస్తాలకు వారే కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులు జారీ చేసిన నంబర్లు 300 వరకు ఉండడంతో అనేక మంది రైతులు స్థానిక మార్కెట్‌లోనే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
మార్కెట్‌యార్డు చైర్మన్ వివరణ
ఈ విషయంపై మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ ప్రభాకర్ చౌదరిని వివరణ కోరగా కొనుగోలు చేసిన వేరుశెనగ కాయలను ఆయిల్‌ఫెడ్ అధికారులు తమ గోడౌన్లకు తరలించడంతో చోటు చేసుకుంటున్న జాప్యం కారణంగా వేల క్వింటాళ్ల కాయలు మార్కెట్‌యార్డులో నిల్వ ఉండిపోయాయన్నారు. త్వరితగతిన ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

జగన్ పాదయాత్రలో సమస్యల ఏకరువు
ధర్మవరం, డిసెంబర్ 16: 36వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర శనివారం ధర్మవరం మండలం చిగిచెర్ల నుండి తుమ్మల వరకు కొనసాగింది. చిగిచెర్ల నుండి ప్రారంభమైన జగన్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. దారి పొడవునా వారి సమస్యలను విన్నవించుకుంటు ఏకరువు పెట్టారు. పాదయాత్రలో తనను కలిసిన రైతు, రైతు కూలీలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్‌టీసీ, ఎమ్మార్పీఎస్, జర్నలిస్టు యూనియన్లు ఇలా ప్రతి ఒక్కరి సమస్యను జగన్ సావధానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభంలోనే జిల్లా న్యాయవాదుల సంఘం జగన్ మోహన్‌రెడ్డిని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల సమాఖ్యకు తెలంగాణా తరహాలో రూ.100 కోట్ల వెల్ఫేర్ నిధులు మంజూరు చేయడంతోపాటు బార్ అసోసియేషన్ భవనాలు, అందులో క్యాంటీన్లు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని పేర్కొంటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జూనియర్ అడ్వకేట్లకు స్ట్ఫైండ్ కింద నెలకు రూ.5 వేలు మంజూరు చేయాలని, న్యాయవాదుల సంక్షేమ చట్టం ప్రకారం మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయడంతోపాటు పలు విన్నపాలు అందించారు. అలాగే ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయడంతోపాటు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే ఎస్‌కే.యూనివర్శిటీ నిరుద్యోగులు వారి సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలిగించేలా ఏపీపీ ఎస్సీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పరీక్షా విధానం, మైనస్ మార్కుల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. వెంటనే ఖాళీగా వున్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, పదవీవిరమణకు అనుగుణంగా అన్ని శాఖల్లోను ఖాళీలను భర్తీ చేయాలని, ప్రతి రెండు సంవత్సరాలకొకసారి డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని ఇలా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను సక్రమంగా భర్తీ చేయకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని, వెంటనే వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు పాదయాత్రలో జగన్‌ను కలిసి 2014 ఎన్నికల అనంతరం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు వున్నపళంగా తమను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల నుంచి తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. వీటికితోడు ధర్మవరం పట్టణానికి తాగునీరందించే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి పథకంలో పనిచేస్తున్న పలువురిని రాజకీయ కక్షతో తొలగించారని జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు తమ వర్గీకరణ సమస్యకు మద్దతు పలకాలని రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అలాగే రైతు, రైతు కూలీలు తమ పంట గిట్టుబాటు ధరలు లేవని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. అందరి సమస్యలు విన్న జగన్ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలకు దూరంగా పని చేస్తోందని, పార్టీ అభివృద్ధి, వారి కార్యకర్తల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని, త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడి అందరి కష్టాలు తీరుస్తానంటు హామీ ఇచ్చారు.
రవూఫ్ వైసీపీలో చేరిక...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో మైనారిటీ విభాగంలో వివిధ పదవుల్లో పనిచేసిన ధర్మవరం పట్టణానికి చెందిన అబ్దుల్ రవూఫ్ శనివారం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. పాదయాత్రలో భాగంగా గొట్లూరు సమీపంలో రవూఫ్, పలువురు అనుచరులు, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
సమ్మెటీవ్ -1 పరీక్షలను తనిఖీ చేసిన డీఈఓ
అనంతపురం సిటీ, డిసెంబర్ 16: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో శనివారం నుండి ప్రారంభమైన సమ్మేటీవ్-1 పరీక్షలను జిల్లా విద్యా శాఖాధికారి జనార్థనాచార్యులు తనిఖీ చేశారు. జిల్లాలోని బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గార్లదినె్న ఉన్నత పాఠశాలలో సమ్మేటీవ్-1 పరీక్షల జరుగు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లును పకడ్బందీగా చేశామని తెలిపారు.
అంబరాన్నంటిన అయ్యప్పస్వామి గ్రామోత్సవం
బత్తలపల్లి, డిసెంబర్ 16: నియమ నిష్టలతో మాలలు ధరించిన అయ్యప్పలు శనివారం భారీ స్థాయిలో అయ్యప్ప గ్రామోత్సవాన్ని నిర్వహించి సంబరాలు అంబరాన్నంటాయి. బత్తలపల్లికి వివిధ గ్రామాల నుండి మాలలు ధరించిన అయ్యప్పలు భారీగా విచ్చేశారు. సాయంకాలం స్థానిక అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప, గణపతిలకు ప్రత్యేక పూజలను గురుస్వామి శెట్టప్ప నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో అయ్యప్ప చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. వాహనానికి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. వాహనం ముందు అయ్యప్పలు నాట్యమాడుతుండగా వారి వెనుకనే బాలికలు హారతులు పట్టారు. ఆలయం నుండి బత్తలపల్లి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో కీలుగుర్రాలు, చెక్క భజనలు భక్తులను, ప్రజలను ఆకట్టుకున్నాయి. డప్పుల మోతల మధ్య అయ్యప్పలు నాట్యమాడుతుండగా బాణసంచాలు కాలుస్తూ గ్రామోత్సవం అంబరాన్నంటింది. గ్రామోత్సవాన్ని తిలకించడానికి పురవీధుల్లో భక్తులు భారీగా విచ్చేశారు. అయ్యప్పకు నారికేళాలు సమర్పించుకుని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. సాయంత్రం ప్రారంభమైన గ్రామోత్సవం పురవీధుల్లో ఊరేగింపు అనంతరం రాత్రి 9గంటలకు ఆలయానికి చేరుకుంది. అనంతరం భక్తులకు, అయ్యప్పలకు, ప్రజలకు అన్నదానాన్ని నిర్వహించారు. గ్రామోత్సవం నిర్వహిస్తుండడంతో జాతీయ రహదారి అయిన బత్తలపల్లిలో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి జక్కంపూటి సత్యనారాయణ, పలు గ్రామాల నుండి విచ్చేసిన అయ్యప్పలు, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సోలార్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి
* టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్
కదిరి, డిసెంబర్ 16: నంబులపూలకుంట మండలంలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోలార్ హబ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన లు చేపడతామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. ఇందుకు మూడు రోజులు గడువు ఇస్తున్నామన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర సంస్థ అయిన ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ హబ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో స్థానికులు తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆశతో సుమారు 7500 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఆ సంస్థ వారు స్థానికులు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు కల్పించారన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్‌టీపీసీ డైరెక్టర్‌ను తాము కోరడం జరిగిందని, ఈ విషయంపై వారు ఆలోచించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్లు దాదెం శివారెడ్డి, చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు.