జాతీయ వార్తలు

జెఎన్‌యు వ్యవహారంలో తక్షణం జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌యు)లో దేశ వ్యతతిరేక నినాదాల పేరుతో వామపక్ష, అభ్యుదయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వామపక్షాలు, ఇతర పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. భారత దేశ ప్రజల రాజ్యాంగ హక్కులపై సంఘ్ శక్తులు దేశ వ్యతిరేకులు అన్న ప్రచారంతో దాడులకు చేస్తున్నాయని, భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. వామపక్షాల నాయకులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి పాటుగా ఆర్జేడి ,జెడియు నేతలు శుక్రవారం రాష్టప్రతి భవన్‌లో ప్రణబ్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఉన్నత విద్యాసంస్థలలో మతతత్వశక్తుల అజెండాను ఏన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని, యూనివర్శిటీలలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న పరినామాలు వీటికి బలం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. సంఘ్ శక్తులు బహిరంగంగా దాడులు చేస్తున్నాయని, మత ప్రాతిపదికన విభజించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వివరించారు. కన్హయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేసేలా అజ్ఞాపించాలని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. జెఎన్‌యు ఘటనలు తర్వాత పరిణామాలపై వామపక్షాలపై సంఘ్ ,బిజెపి చేస్తున్న విషప్రచారం, దాడులను తిప్పికొట్టేందుకు ఈ నెల 23నుంచి 25 వరకు దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.