క్రీడాభూమి

మూడో రౌండ్‌కు షరపోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో టెన్నిస్ స్టార్ మరియా షరపోవా గురువారం మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. మెల్బోర్న్‌లో వేసవి ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్షియస్‌కు చేరిప్పటికీ, ఆమె రెండో రౌండ్‌లో అనస్తసిజా సెవస్టోవాను 6-1, 7-6 తేడాతో ఓడించింది. 14వ సీడ్‌గా బరిలోకి దిగిన షరపోవా రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ టోర్నీలో ఆడుతున్నది. 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగిన వెంటనే, తాను నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వినియోగించినట్టు ప్రకటించి సంచలనం రేపింది. ఈ కారణంగా సస్పెన్షన్‌కు గురైన ఆమె గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆడడం ద్వార మళ్లీ గ్రాండ్‌శ్లామ్ ఎంట్రీనిచ్చింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకూ చేరింది. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో సెట్‌ను పూర్తి చేసిన తర్వాత షరపోవా విలఖరులతో మాట్లాడుతూ మెల్బోర్న్‌లో ఉక్కపోత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి, పోటీలో గతంలో ఎదురైన ఒత్తిడిని అధిగమించానని పేర్కొంది. ఇపుడు తన కళ్లముందు చివరి రౌండ్ మెదులుతోందని, అందులో కూడా విజయం సాధిస్తాననే విశ్వాసంతో ఉన్నానని తెలిపింది.
మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆరోసీడ్ కరోలినా ప్లిస్కోవా 6-1, 6-1 తేడాతో బీట్రిజ్ హాడాడ్ మాలాను, ఎనిమిదో సీడ్ కరోలిన్ గార్సియా 6-7, 6-2, 8-6 ఆధిక్యంతో మార్కెటా వాండ్రొసొవాను ఓడించి మూడో రౌండ్ చేరారు. కామిలా గోర్గీని ఆష్లే బార్టీ 5-7, 6-4, 6-1 స్కోరుతో విజయాన్ని నమోదు చేసింది. 21వ ర్యాంక్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ 6-4, 6-1 తేడాతో డొనా వెకిక్‌ను ఓడించింది. 17వ ర్యాంకర్ మాడిసన్ కీస్ 6-0, 6-1 ఆధిక్యంతో ఎకతరీన అలెగ్జాండ్రోవాపై గెలిచింది.
గార్బినెజ్‌కు సూవెయ్ షాక్
మెల్బోర్న్: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినె ముగురుజాకు మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సీ సూవెయ్ షాకిచ్చింది. వరుస సెట్లలో ఆమెపై 7-6, 6-4 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.